‘మిషన్ ఇంపాజిబుల్’ ఫస్ట్ లుక్ రిలీజ్: మరో ఆసక్తికర ప్రాజెక్టుతో వస్తున్న ఏజెంట్ డైరెక్టర్
కొత్త తరహా సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే బాగా ఇష్ట పడుతున్నారు. దీంతో దర్శక నిర్మాతలు సైతం ప్రయోగాత్మక ప్రాజెక్టులతో ముందుకొస్తున్నారు. ఈ కారణంగానే ఇటీవలి కాలంలో టాలీవుడ్‌కు ఎంతో మంది నూతన దర్శకులు పరిచయం అయ్యారు. అలా చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకున్న దర్శకుల్లో స్వరూప్ ఒకడు. జేమ్స్‌బాండ్ తరహా జోనర్‌లో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' మూవీని రూపొందించిన అతడు.. తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
స్వరూప్ ప్రస్తుతం 'మిషన్ ఇంపాజిబుల్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో శ్రీకృష్ణుడు, శివుడు, హనుమంతుని గెటప్పులలో ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. వాల్లు ముగ్గురు చేతుల్లో తుపాకులు పట్టుకుని కనిపిస్తున్నారు. దీంతో ఈ మూవీ కూడా సరికొత్త కంటెంట్‌తో రూపొందబోతుందని అర్థం అవుతోంది. అలాగే టైటిల్ కూడా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 14 నుంచే ప్రారంభం కాబోతుందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తుండగా దీపక్ యెరగర సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు ఎవరన్న దానిపై క్లారిటీ రాలేదు. పోస్టర్‌ను బట్టి చూస్తే ఇది చిన్న పిల్లలతో తీసే సినిమానా అన్న సందేహం వ్యక్తం అవుతోంది. పెద్ద సంస్థ నిర్మాణంలో వస్తున్న సినిమా కావడంతో ఎంతో గ్రాండ్‌గా ఈ మూవీ రూపొందనుంది.


Click it and Unblock the Notifications











