twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆహా పట్టేసిన అద్భుతమైన మూవీస్.. లవ్ స్టోరీతో పాటు మరో రెండు ఆసక్తికరమైన సినిమాలు

    |

    సినిమా ప్రపంచంలో ఒకప్పుడు థియేట్రికల్ రిలీజ్ ద్వారానే నిర్మాతలకు లాభాలు వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం నాన్ థియేట్రికల్ బిజినెస్ వలన భారీ స్థాయిలో లాభాలు అందుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విదంగా శాటిలైట్, డబ్బింగ్, ఆడియో, ఓటీటీ డిజిటల్ హక్కుల రూపంలో సినిమాలకు భారీ ఆదాయం అందుతోంది. ఇక ఓటీటీ కంపెనీల మధ్యలో కూడా పోటీ తీవ్రత ఎక్కువయ్యింది. ఆహా యాప్ కూడా ప్రస్తుతం మంచి సినిమాలను టార్గెట్ చేస్తోంది. రానున్న రోజుల్లో ఆ కంపెనీ నుంచి మరిన్ని ఆసక్తికరమైన సినిమాలు రాబోతున్నట్లు తెలుస్తోంది.

    అల్లు అరవింద్ చేతుల్లోకి వచ్చాక..

    అల్లు అరవింద్ చేతుల్లోకి వచ్చాక..

    అల్లు అరవింద్ ఆహా యాప్ ను దక్కించుకున్నప్పటి నుంచి కూడా అసలైన సందడి మొదలైంది. ఒరిజినల్ తెలుగు ఓటీటీ యాప్ గా చక్రం తిప్పాలని మొదలైన ఆ యాప్ కు మొదట అంతగా క్రేజ్ రాలేదు. హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ నుంచి పోటీ కూడా గట్టిగానే ఎదురయ్యింది. ఇక అల్లు అరవింద్ చేతుల్లోకి వచ్చాక కథ మొత్తం మారిపోయింది.

     చిన్న సినిమాలను డైరెక్ట్ గా..

    చిన్న సినిమాలను డైరెక్ట్ గా..

    అల్లు అరవింద్ చాలా వరకు గీతా ఆర్ట్స్ సపోర్ట్ తో వచ్చే సినిమాలను తనవైపుకు లాగేసుకుంటున్నారు. ఇక చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో తెరకెక్కుతున్నాయి అంటే వాటిని డైరెక్ట్ గా ఆహా యాప్ లో రిలీజ్ చేయిస్తున్నారు. కలర్ ఫొటో ఆ విధంగా బాగానే క్లిక్కయ్యింది. అలాగే సమంత టాక్ షో కూడా బాగానే బజ్ క్రియేట్ చేసింది.

    ఆహా యాప్ లో కమ్ముల లవ్ స్టొరీ

    ఆహా యాప్ లో కమ్ముల లవ్ స్టొరీ

    ఇక క్రాక్ సినిమా థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఆహాలో వదిలారు. అప్పుడు కూడా మంచి క్రేజ్ దక్కింది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆహాలో సందడి చేయనున్నట్లు సమాచారం. థియేట్రికల్ గా రిలీజ్ చేసిన అనంతరం శేఖర్ కమ్ముల లవ్ స్టొరీ సినిమా ఇందులోనే రిలీజ్ కానున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.

     మరో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు

    మరో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు

    ఇక అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అల్లు అరవింద్ GA2 పిక్చర్స్ లోనే తెరకెక్కుతోంది కాబట్టి ఆ సినిమా కూడా ఆహాలోకి రానుంది. ఇక నాగశౌర్య చేస్తున్న లక్ష్య సినిమా ఓటీటీ హక్కులు కూడా ఆహా యాప్ కు దక్కినట్లు సమాచారం. వీటితో పాటు ఇతర ఎంటర్టైన్మెంట్ టాక్ షోలను కూడా నిర్వహించాలని అనుకుంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఆహా యాప్ అగ్ర ఓటీటీ కంపెనీలకు ఎంతవరకు పోటీని ఇస్తుందో చూడాలి.

    English summary
    Competition has also intensified among OTT companies. The Aaha app is also currently targeting good movies. It seems that more interesting movies are coming from that company in the coming days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X