For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వెరీ ఇంట్రెస్టింగ్: అక్కినేని హీరోకు విలన్‌గా మారిన క్రేజీ డైరెక్టర్.. ఒకేసారి రెండు రోల్స్.!

  By Manoj Kumar P
  |

  'RX100' దర్శకుడు అజయ్ భూపతి త్వరలోనే మాస్ హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని ఎప్పటి నుంచో ఓ వార్త హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సిద్ధార్ద్‌ను కూడా నటింపజేసేందుకు ఆయన ప్రయత్నాలు జరుపుతున్నాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. దీనికి 'మహాసముద్రం' అనే టైటిల్ అనుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఇటు అజయ్ భూపతి కానీ, అటు ఆ హీరో కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. కానీ, తాజాగా ఈ ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు, దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం కూడా బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

  చాలా మందిని అనుకున్నాడు

  చాలా మందిని అనుకున్నాడు

  ‘RX100' సినిమా విడుదలై దాదాపు రెండేళ్లు కావొస్తున్న దర్శకుడు అజయ్ భూపతి మాత్రం మరో సినిమాను పట్టాలెక్కించలేదు. ఆయన ‘మహాసముద్రం' అనే స్క్రిప్టు పట్టుకుని మాస్ మహారాజ రవితేజ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సహా ఎందరినో సంప్రదించాడని గతంలో వార్తలు వచ్చాయి. కానీ, వీరిలో ఎవరూ ఈ సినిమా చేయడం లేదని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది.

  అక్కినేని హీరో లైన్‌లో పెట్టుకున్నాడు

  అక్కినేని హీరో లైన్‌లో పెట్టుకున్నాడు

  ఈ సినిమా విషయంలో అజయ్ భూపతి చాలా మందిని సంప్రదించినప్పటికీ ఎవరూ ఓకే చేయలేదట. అయితే, ఇటీవల అక్కినేని నాగ చైతన్య ఈ సినిమా స్క్రిప్ట్ విన్నాడని తెలిసింది. ఈ ప్రాజెక్టు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు కానీ, స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయమని దర్శకుడికి సలహా ఇచ్చాడని సమాచారం. దీంతో అజయ్ భూపతి ఆయనకు సెట్ అయ్యే రీతిలో స్టోరీ రెడీ చేశాడని టాక్.

  నాగ చైతన్యపై సమంత ఒత్తిడి

  నాగ చైతన్యపై సమంత ఒత్తిడి

  ‘RX100' దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల చైతూకు కథను చెబుతున్న సమయంలో సమంత కూడా దీన్ని విన్నదని తెలిసింది. ఈ కథ చైతూ కంటే సమంతకే బాగా నచ్చిందట. దీంతో ఈ సినిమా చేయాల్సిందేనని తన భర్తపై ఆమె ఒత్తిడి చేస్తుందట. అంతేకాదు, ఈ సినిమా చైతూ చేస్తాడని డైరెక్టర్‌కు హామీ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కడం ఖాయమని సమాచారం.

  మల్టీస్టారర్‌గా మహాసముద్రం

  మల్టీస్టారర్‌గా మహాసముద్రం

  ‘RX100' దర్శకుడు అజయ్ భూపతి చేయబోతున్న ఈ సినిమాను మల్టీ స్టారర్‌గా తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. గతంలో ఈ సినిమాలో హీరోతో పాటు సిద్ధార్ద్‌ను కూడా నటింపజేసేందుకు ఆయన ప్రయత్నాలు జరుపుతున్నాడని ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేసింది. అంతేకాదు, ఈ ప్రాజెక్టు చేయడానికి సిద్దార్ధ్ ఒప్పుకున్నాడని కూడా ప్రచారం జరిగింది. దీంతో ఈ హ్యాండ్సమ్ హీరో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తాడని అనుకున్నారు.

  విలన్‌గా మారుతున్న డైరెక్టర్

  విలన్‌గా మారుతున్న డైరెక్టర్

  ‘మహాసముద్రం'లో హీరోతో సమానమైన పాత్ర ఒకటి ఉంటుందట. అయితే, ఈ పాత్రకు కొన్ని నెగెటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. దీంతో ఈ క్యారెక్టర్‌ను చేయడానికి పేరున్న హీరోలు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అజయ్ భూపతే ఈ పాత్రను పోషించబోతున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అంటే.. ఒకేసారి దర్శకుడిగా, నటుడిగా ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నాడన్న మాట.

  ఆ వెంటనే ప్రారంభం

  ఆ వెంటనే ప్రారంభం

  అక్కినేని హీరో నాగ చైతన్య ఇటీవల విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘వెంకీమామ' అనే సినిమాలో నటించాడు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత అతడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఇది షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో చైతూకు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే ‘మహాసముద్రం' ప్రారంభం అవుతుందని ప్రచారం జరుగుతోంది.

  English summary
  Ajay Bhupathi worked as an AD to Veeru Potla and Ram Gopal Varma before fulfilling his directorial dream with ‘RX 100’ which turned out to be a massive success at the ticket counters.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X