RRR అదిరిపోయే అప్‌డేట్: రాజమౌళికి షేక్ హ్యాండ్ ఇచ్చిన సూపర్ స్టార్.. ఇకపై ఆయన కూడా

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న తాజా సినిమా RRR. 'బాహుబలి' లాంటి భారీ సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఈ సినిమా కోసం టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ భారీ లాంటి భారీ తారాగణానికి తోడు బాలీవుడ్ నుంచి అజయ్ దేవగణ్, అలియా భట్ లాంటి స్టార్ నటీనటులను తీసుకున్నారు.

 శరవేగంగా షూటింగ్.. అజయ్ దేవగణ్ ఇన్

శరవేగంగా షూటింగ్.. అజయ్ దేవగణ్ ఇన్

గత కొంతకాలంగా శరవేగంగా షూటింగ్ జరుపుతున్న చిత్రయూనిట్ ఇప్పటికే 70 శాతం మేర షూటింగ్ ఫినిష్ చేసినట్లు టాక్. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ లకు సంబంధించిన షూటింగ్ చాలావరకు పూర్తయింది. ఇక తాజాగా RRR సెట్స్ పైకి అజయ్ దేవగణ్ కూడా వచ్చేశారు.

హైదరాబాద్‌ చేరుకున్న సూపర్ స్టార్.. షేక్ హ్యాండ్

హైదరాబాద్‌ చేరుకున్న సూపర్ స్టార్.. షేక్ హ్యాండ్

అజయ్ దేవగణ్‌కి సంబంధించిన షెడ్యూల్ ఈ రోజు (జనవరి 21) నుంచే ప్రారంభమయింది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం నిన్ననే హైదరాబాద్‌ చేరుకున్న ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ నేడు సెట్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాజమౌళి ఆయనకు స్వాగతం పలుకుతూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

సినిమాకే స్పెషల్ అట్రాక్షన్.. అజయ్ దేవగణ్ రోల్

సినిమాకే స్పెషల్ అట్రాక్షన్.. అజయ్ దేవగణ్ రోల్

ఈ భారీ ప్రాజెక్టుకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అజయ్ పాత్ర ఏంటనేది మాత్రం సస్పెన్సులో పెట్టింది చిత్రయూనిట్. కాకపోతే ఈయన పాత్ర సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని టాక్ నడుస్తోంది.

రామ్ చరణ్‌, ఎన్టీఆర్ జోడీ.. రామ రౌద్ర రుషితం

రామ్ చరణ్‌, ఎన్టీఆర్ జోడీ.. రామ రౌద్ర రుషితం

ఇక చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటించనున్నారు. ఎన్టీఆర్ జోడీగా ఒలీవియా మోరిస్ నటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. చిత్రానికి రామ రౌద్ర రుషితం అనే టైటిల్ పరిశీలనలో పెట్టింది చిత్రయూనిట్.

RRR విడుదల తేదీపై సందేహాలు

RRR విడుదల తేదీపై సందేహాలు

మరోవైపు RRR విడుదల తేదీపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాను జులై 30న రిలీజ్ చేస్తామని షూటింగ్ ప్రారంభానికి ముందే రాజమౌళి ప్రకటించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ సినిమా విడుదల తేదీ మారే ఛాన్స్ ఉందని టాక్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X