Akhanda 2: ఇక బాలయ్య రుద్ర తాండవమే.. తమన్ ప్లాన్ తో థియేటర్స్ దద్దరిల్లసిందే..

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే చాలు.. ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ పరుగులు పెడుతుంటుంది. ఇక మాస్ ఆడియన్స్ అయితే.. బాలయ్య కనిపిస్తే చాలు పునకాలతో ఊగిపోతారు. థియేటర్లను దేవాలయాలు మార్చేస్తారు. ఇలాంటి కాంబోకు మ్యూజిక్ లెజెండ్ తమన్ తోడైతే.. థియేటర్స్ దద్దరిల్లసిందే.. బాక్సాఫీస్ రికార్డ్స్ షేక్ కావాల్సిందే.. ఇలా వీరి ముగ్గురు కాంబోలో వస్తున్న హై యాక్షన్ థ్రిల్లర్ ఆఖండ 2 కోసం తమన్ సరికొత్త ప్లాన్ తో రంగంలోకి దిగుతున్నారంట. ఇంతకీ ఏం చేయబోతున్నారంటే?

బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇప్పటివరకు సింహ, లెజెండ్, అఖండ ఇలా మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు ఎలాంటి విజయాలను సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య కెరీర్ లో ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇందులో 'అఖండ'సినిమా అయితే అంచనాలకు మించి ఘనవిజయం సాధించింది. కరోనా తరువాత వచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ భారీ బస్టర్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న హై యాక్షన్ థ్రిల్లర్ 'అఖండ 2'.(Akhanda 2). ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి ప్రేక్ష‌కులలో అంచ‌నాల‌ను హై ఎండ్ కు చేరాయి.

Akhanda 2 Thaman s Rudra Tandavam BGM to Elevate Balakrishna s Mass Action Sequences
ఇప్పటికే రిలీజ్ అయిన బాలయ్య లుక్స్, టీజర్.. కేవలం నందమూరి ఫ్యాన్స్‌కే కాదు.. ఇతర మూవీ లవర్స్ కూడా గూస్ బంప్స్‌ తెప్పిస్తున్నాయి. టీజర్‌లోని బాలయ్య మాస్ యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఇప్పటికే అట్రాక్షన్ పెంచింది. ఈ క్రమంలో మ్యూజిక్ లెజెండ్ తమన్ తాజాగా అఖండ 2 బీజీఎం పై సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. తమన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'అఖండ తాండవం స్కోర్ బిగిన్స్'అని రాసుకొచ్చారు. రీ-రికార్డింగ్ పనులు ఇప్పటికే మొదలై ఉంటాయని, ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ ఫోటోను కూడా షేర్ చేశారు.

బాలకృష్ణ-తమన్ కలయికలో ముందుగా వచ్చిన సినిమాలు ఇప్పటికే అద్భుతమైన సంగీత అనుభవాన్ని అందించాయని గుర్తు చేస్తాయి. 'అఖండ 2: తాండవం' కోసం కూడా అదే స్థాయి ఎక్సైట్‌మెంట్‌ను ఇవ్వాలన్నదే తమన్ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అఖండ 2 తాండవం కోసం తమన్ ఓ ప్రత్యేక ప్రయోగం చేయబోతున్నట్టు తెలుస్తోంది. బాలయ్య ఎలివేషన్, ఎంట్రీ, ఫైటింగ్ సీన్స్ కు ఓ బీజేఎం ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గంభీరమైన స్వరంతో సంస్కృత శ్లోకాలు పఠిస్తుంటే.. హీరో నందమూరి బాలకృష్ణ ఎలివేషన్ ప్లాన్స్ చేస్తున్నట్టు అర్థం అవుతుంది.

ఈ ప్రయత్నంలో భాగంగా సంస్కృత శ్లోకాలు, వేద మంత్రాల ప్రత్యేకతను ఇంకా ప్రబలంగా చూపడానికి పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరులు రంగంలోకి దిగారు తమన్. వీరిద్దరూ సంస్కృత శ్లోకాల నైపుణ్యానికి పేరు తెచ్చుకున్నవారు. వారు చెబే శ్లోకాలు, వేద మంత్రాలు 'అఖండ 2: తాండవం'నేపథ్య సంగీతాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాలని భావిస్తున్నారు. ఈ ప్రత్యేక నేపథ్య సంగీతం ప్రేక్షకుల మాస్ యాక్షన్, క్లైమాక్స్ సీన్‌లను మరింత గంభీరంగా, గుస్ బంప్స్ వచ్చేలా మార్చాలని భావిస్తున్నారట.

గతంలో తమన్ మాట్లాడుతూ, "బాలయ్యను చూస్తే ఎక్కడా లేని జోష్ వస్తుంది. న్యూ డ్రమ్స్ పగలగొట్టేలా వాయించాలి అనిపిస్తుంది"అని చెప్పడం విశేషం. టీజర్‌లో ఉన్న సిగ్నేచర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బాలయ్య మాస్ యాక్షన్‌కు పూర్తి హైలైట్‌గా మారినట్టు చెప్పవచ్చు. ఈ మూవీ‌లో బాలయ్య మాస్ యాక్షన్ సీక్వెన్స్‌ను 'రుద్ర తాండవం' అనేలా థామన్ మ్యూజిక్ స్కోర్ రూపంలో అందించబోతున్నాడు. ఇప్పటికే ఫ్యాన్స్, మూవీ లవర్స్ టీజర్‌ని చూసి థియేటర్స్‌లో సినిమా హిట్టు ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు.

అఖండమూవీలో బాలయ్య సరసన సంజుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు, ఆది పినిశెట్టి విలన్ రోల్ పోషిస్తున్నారు. అలాగే హర్షాలి మెహతా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ బాలకృష్ణ కుమార్తె ఎం.తేజస్విని సమర్పణలో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మిస్తున్నారు. ఆఖండ టీజర్, బాలయ్య లుక్‌లు, థియేటర్స్‌లో మాస్ యాక్షన్, తమన్ మ్యూజిక్ స్కోర్ పై అందరూ ఫోకస్ పెడుతున్నారు. ప్రత్యేకంగా రుద్ర తాండవం కోసం రూపొందిస్తున్న మ్యూజిక్ సీక్వెన్స్, థియేటర్స్‌ను దద్దరిల్లించనుందనే అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ అంచనాలు కూడా పీక్‌లో ఉన్నాయి. ఈ మూవీ డిసెంబర్ 5 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X