‘బంగార్రాజు’ అప్‌డేట్: నాగార్జున సినిమా నుంచి నాగ చైతన్య ఔట్.. మరో యంగ్ హీరో ఇన్

అక్కినేని నాగార్జున - కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయన'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఆయన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇందులో రెండు పాత్రలు పోషించిన నాగ్.. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయిపోయింది. అప్పటి నుంచి దీనికి సంబంధించిన పనులు చేస్తూనే ఉన్నాడు దర్శకడు కల్యాణ్ కృష్ణ.

సుదీర్ఘ విరామం తర్వాత 'బంగార్రాజు'ను పట్టాలెక్కించడానికి లైన్ క్లియర్ చేసుకున్నారు అక్కినేని నాగార్జున. డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇందులో రమ్యకృష్ణ ఆయన భార్యగా నటించనున్నారు. అలాగే, అక్కినేని నాగ చైతన్య కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడని ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది. కానీ, అనివార్య కారణాలతో ఆ పాత్రను తీసేయాల్సి వస్తుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'బంగార్రాజు'లో నాగార్జునతో పాటు ఆయన చిన్న కుమారుడు అఖిల్ కూడా నటిస్తున్నాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది.

Akhil Akkineni to play key role in Bangarraju

వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న అక్కినేని అఖిల్ ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత సురేందర్ రెడ్డితో సినిమా చేయాల్సి ఉంది. ఈ లోపు నాగార్జున నటిస్తున్న 'బంగార్రాజు'లో ఓ పాత్రను పోషించడానికి అతడు సిద్ధం అయ్యాడని తెలుస్తోంది. ఎంతో కీలకమైన ఈ పాత్రను దర్శకుడితో ప్రత్యేకంగా డిజైన్ చేయించాడట నాగ్. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం నాగార్జున 'వైల్డ్ డాగ్' అనే సినిమాలో నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X