Just In
- 2 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 3 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 4 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 5 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సంక్రాంతి సంబరాలు.. మెగా సెలెబ్రేషన్స్.. ప్రత్యేక ఆకర్షణగా అకీరా, ఆద్య
సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. తెలుగు రాష్ట్రాల్లో నెలకొనే సందడే వేరు. ఇదంతా ఒకెత్తు అయితే సినీ పరిశ్రమకు సంక్రాంతి ఎంతో ప్రత్యేకం. బడా సినిమాలు బరిలోకి దిగా కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. సినీ పరిశ్రమ అంతా సందడి సందడిగా మారుతుంది. అందులోనూ సంక్రాంతి పండుగ అంటే మెగా ఫ్యామిలీ ఇంట మరింత కోలాహలంగా మారుతుంది.

అందరూ ఒకే చోట..
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు మెగా కాంపౌండ్ అంతా ఒక్కచోటుకు చేరాల్సిందే. ఎంత బిజీగా ఉన్నా.. ఏ చోట ఉన్నా సరే అందరూ ఒకే చోట చేరాల్సిందే. ఇక అందరూ మూడు రోజులు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. భోగి మంటలు, సంక్రాంతి పిండి వంటలు, మ్యూజికల్ నైట్స్, ఆట పాటలు ఇలా అబ్బో చూడటానికి రెండు కళ్లు చాలవేమోనన్నట్లు అనిపిస్తాయి.

మెగా హీరోలంతా ఒకే చోట..
సంక్రాంతి వేడుకల్లో భాగంగా సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, చిరంజీవి, కళ్యాణ్ దేవ్ ఇలా అందరూ ఒకేచోటుకు చేరుకున్నారు.

మెగా ఆడపడుచులు సైతం..
మెగా ఫ్యామిలీ ఆడపడుచులు సైతం ఈ సారి ఫుల్ హల్ చల్ చేసినట్టు కనిపిస్తోంది. చిరు పెద్ద కూతురు సుష్మిత, చిన్నకూతురు శ్రీజ, నిహారిక, అల్లు స్నేహారెడ్డి, ఉపాసన ఇలా అందరూ బాగానే సందడి చేసినట్టు తెలుస్తోంది. వీరితో పాటు పిల్లలు కూడా చేరడంతో కోలాహలంగా మారినట్టు కనిపిస్తోంది.

ప్రత్యేక ఆకర్షణగా అకీరా, ఆద్య..
మెగా ఇంట జరిగే ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్, ఆద్యలు ప్రత్యక్షమవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే పవన్ కళ్యాణ్ లేకపోయినా.. అకీరా నందన్ ఈ వేడుకల్లో పాల్గొనడంతో అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మెగా పిక్స్ వైరల్
మెగా ఇంట జరిగిన వేడుకలు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. మెగా హీరోలంతా ఒకే ఫ్రేములో కనబడటం, అకీరా, ఆద్యలు నానమ్మ ఇంటికి రావడం, మ్యూజికల్ నైట్స్‌లో భాగంగా వరుణ్ తేజ్ సినిమాలకు సంబంధించిన పాటలు, సామజవరగమన పాట ప్లే చేయడం వాటికి సంబంధించిన వీడియోలను షేర్ చేయడంతో సోషల్ మీడియా షేక్ అయింది. మెగా ఫ్యాన్స్ లైక్స్, షేర్స్, కామెంట్స్‌తో అవి ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి.