‘100 కోడిగుడ్లతో ఆ స్టార్ హీరోని కొట్టి.. అమ్మాయిలంతా రౌండప్ చేసి దారుణంగా’
మూడు గంటల పాటు ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో శ్రమిస్తారు. నోరు కట్టేసుకుని కడుపు మాడ్చుకోవడంతో పాటు గంటల కొద్ది జిమ్‌లో వర్కవుట్స్, షూటింగ్స్‌లో ప్రమాదాల కారణాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు, శాశ్వతంగా అంగవైకల్యం పొందినవారు ఎందరో ఉన్నారు. ఏం జరిగినా సరే, ఎంత కష్టమైనా సరే ప్రేక్షకులు కొట్టే చిన్న విజిల్‌తో తమ కష్టాన్ని మరిచిపోతారు. తాజాగా ఓ సినిమా షూటింగ్ సమయంలో స్టార్ హీరోకి ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్. ఈ వివరాల్లోకి వెళితే..
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు చిన్ని ప్రకాష్. దాదాపు 60 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ ఇండస్ట్రీలలో కొరియోగ్రాఫర్‌గా ఎన్నో హిట్ సినిమాలకు కొరియోగ్రఫి అందించారు. ఎందరో స్టార్ హీరోలకు ఆయన ఫేవరెట్ మాస్టర్. అశోక్ కుమార్, సునీల్ దత్, దిలీప్ కుమార్, ప్రేమ్ నజీర్, ఎంజీ రామచంద్రన్, విష్ణువర్ధన్, చిరంజీవి, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ వంటి దిగ్గజాలకు కొరియోగ్రఫి అందించారు. వయసు పైబడినప్పటికీ తనలో ఏమాత్రం వాడి వేడి తగ్గలేదని చిన్ని ప్రకాష్ నిరూపించారు. చివరిసారిగా 2017లో బడ్డీస్ ఇన్ ఇండియా అంటూ మాండరిన్ భాషలో తెరకెక్కిన ప్రకాష్ కొరియోగ్రఫి అందించారు.

అక్షయ్ కుమార్‌పై ప్రశంసలు
ఇటీవలి కాలంలో వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్న చిన్ని ప్రకాష్.. బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్‌తో షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు. సినిమా కోసం ప్రాణం పెట్టి నటించే నటీనటులు చాలా అరుదు. ఈ లిస్ట్‌లో ముందు వరుసలో ఉంటారు అక్షయ్. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలీవుడ్ ఖాన్ త్రయంతో ఢీ అంటే ఢీ అనేలా సినిమాలు తీస్తూ ముందుకు వెళ్తున్నారు.
అక్షయ్ డైరీ ఫుల్ బిజీ
హిట్, ఫ్లాప్ అనే అంశాలను పట్టించుకోకుండా సినిమాల విషయంలో రాజీ పడకుండా దూసుకెళ్తున్నారు అక్షయ్. ఈ ఏడాది ఇప్పటికే స్కై ఫోర్స్, కేసరి చాప్టర్ 2, హౌస్‌ఫుల్ 5, కన్నప్ప, జాలీ ఎల్ఎల్‌బీ 3 తదితర సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆయన.. భూత్ బంగ్లా, హైవాన్, వెల్‌కమ్ టు ద జంగీల్ అనే సినిమాలలో నటిస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. అక్షయ్ కుమార్ వ్యక్తిత్వం, సినిమాల కోసం కష్టపడే విధానం గురించి ఎందరో ఎన్నోసార్లు చెప్పారు. తాజాగా చిన్ని ప్రకాష్ కూడా ఈ లిస్ట్‌లో చేరారు.
అక్షయ్‌పై కోడిగుడ్ల దాడి
కెరీర్ తొలినాళ్లలో అక్షయ్ కుమార్‌కు బాగా గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం ఖిలాడీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో అక్షయ్‌కి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ సినిమాకు చిన్ని ప్రకాష్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఇందులోని ఓ పాట కోసం అక్షయ్‌ని అమ్మాయిలంతా కలిసి 100 కోడిగుడ్ల వరకు కొట్టించుకోవాలి. ఈ సీన్ వివరించగానే అక్షయ్ మరో మాట లేకుండా వెంటనే ఓకే అని చెప్పారు.. షాట్ రెడీ అవ్వగానే అమ్మాయిలు ఆయనపై 100కు పైగా కోడిగుడ్లు విసిరేశారు. ఆ సమయంలో నొప్పి కలిగినా పంటి బిగువున భరించారు.. ఎవ్వరిని అక్షయ్ ఒక్క మాట కూడా అనలేదు. షాట్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఒంటిపై కోడిగుడ్ల కంపు పొగొట్టుకోవడానికి కూడా చాలా కష్టపడ్డారు. సూపర్ స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్‌గా ఉంటారు.. ఆయనతో దాదాపు 50 పాటల వరకు కొరియోగ్రఫి చేశాను, ఏనాడూ స్టెప్ మార్చమని అక్షయ్ అనలేదు అని చిన్ని ప్రకాష్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











