సాగర తీరాన సెలెబ్రేషన్స్.. అదిరిపోయే స్కెచ్ వేసిన ‘అల’ టీమ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా 'అల వైకుంఠపురములో'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలై విజయభేరిని మోగిస్తూ దూసుకెళ్తోంది.
'అల... వైకుంఠపురంలో' చిత్రానికి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌గా నమోదు చేసుకుంది. గతానికి భిన్నంగా ఓవర్ సీస్‌లో కూడా ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకోవడం గమనార్హం. సినిమా ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ అభిమానుల సమక్షంలో బహిరంగంగా ఈ చిత్ర విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు.

జనవరి 19న వైజాగ్ లో అల వైకుంఠపురంలో సక్సెస్ సెల్రబ్రేషన్ గ్రాండ్‌గా చేయబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఆర్కే బీచ్‌లో ఆహ్లాదకరమైన వాతావరణంలోఈ చిత్రం విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించబోతోన్నారు. అటుపై తిరుపతి, కర్ణాటక, కేరళలో కూడా సక్సెస్ మీట్స్‌ను నిర్వహించనున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం చిత్రం విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించింది.


Click it and Unblock the Notifications











