Just In
- 1 hr ago
నా గర్ల్‌ఫ్రెండ్ ఈమెనే... సమంతకు పరిచయం చేసిన అల్లు అర్జున్.. బన్నీ తొలి ప్రియురాలు ఎవరంటే!
- 1 hr ago
రాయలసీమ వ్యక్తిగా పవన్ కల్యాణ్: ఆ సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు
- 1 hr ago
Vakeel Saab Day 6 collections..నైజాం, ఏపీలో రికార్డుల మోత.. బాక్సాఫీస్ వద్ద పవన్ కల్యాణ్ మూవీ హల్చల్
- 2 hrs ago
‘ఆచార్య’లో హైలైట్ ఫైట్ ఇదే: ప్రభాస్ సినిమాను తలపించేలా ప్లాన్ చేసిన కొరటాల
Don't Miss!
- News
షాకింగ్: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై శాశ్వత నిషేధం -డెన్మార్క్ సంచలన ప్రకటన -రక్తం గడ్డకట్టి మరణాలు
- Sports
SRH vs RCB: ఔటైన అసహనం.. కుర్చీపై విరాట్ కోహ్లీ కోపం! వీడియో
- Finance
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చు: ఎక్సైజ్ సుంకం తగ్గించే యోచన
- Lifestyle
రొమ్ముల కింద దద్దుర్లు వస్తున్నాయా? రాషెస్ తగ్గించుకోవడానికి ఇలా చేయండి..
- Automobiles
మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కింద పడినా తగ్గేదిలే.. కుమ్మాల్సిందే.. చింపాల్సిందే .. అల్లు అర్జున్ ఎమోషనల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన బర్తేడేను పురస్కరించుకొని హైదరాబాద్‌లో ఓ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంట్రడ్యూస్ పుష్ప రాజ్ అంటూ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సుకుమార్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ మాట్లాడుతూ..

ఇంతకంటే గొప్ప గిఫ్టు ఏముంటుంది?
నా ఫ్యాన్స్, నా ఆర్మీకి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫంక్షన్‌కు వచ్చి విషెస్ అందించిన నా అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. టీజర్ రిలీజ్ మాత్రమే కాదు.. నా పుట్టిన మీతో జరుపుకొంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. పుట్టిన రోజున ఇంతకంటే గొప్ప గిఫ్టు ఏముంటుంది నాకు అని అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు.

ఆర్య సినిమాతో టేకాఫ్
ఈ బర్త్ డే రోజు నాకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి.. ఒకటి పుష్ప టీజర్ ప్రేక్షకులు, అభిమానుల ముందుకు రావడం అంటూ ఇక తగ్గేది లేదంటూ కామెంట్ చేశారు. ఇక రెండోది నా కెరీర్ సుకుమార్ గారి ఆర్య సినిమాతో టేకాఫ్ అయింది. ఆ సినిమాతోనే నాకు స్టైలిష్ స్టార్ అనే పేరు వచ్చింది. ఇక ముందు నా భవిష్యత్‌కు ఐకాన్ స్టార్ అనే కొత్త పేరు వచ్చింది అని అల్లు అర్జున్ అన్నారు.

ఐకాన్ స్టార్ టైటిల్ ఇచ్చినందుకు
నాకు సుకుమార్ ఆర్య ఇచ్చారు. ఇప్పుడు పుష్ప ఇస్తున్నారు. అలాగే ఐకాన్ స్టార్ అని పేరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సుకుమార్ ఏమిచ్చినా నాకు సంతోషమే. స్పెషల్‌గా గుర్తుండి పోతుంది. స్టైలిష్ స్టార్ నుంచి నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లిపోవాలి. చాలా స్టైలిష్‌గా ఉంది.

మిమ్మల్ని సంతోష పెట్టేలా
పుష్ప టీజర్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఏది చేసిన మీకు నచ్చేలా ఉండాలని తాపత్రయం పడుతాను. నచ్చాల్సింది మీకు..కుమ్మాల్సింది మీరు.. చింపాల్సింది మీరు.. థ్యాంక్యూ సో మచ్. మిమ్మల్ని సంతోష పెట్టేలా నా జీవితాన్ని డెడికెట్ చేస్తున్నాను అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

నేను భయపడే క్షణాలు
పుష్ప చిత్రంలో తగ్గేదేలే అనే డైలాగ్‌ను నేను ఎప్పడు ఉపయోగిస్తుంటాను. నాకు అందరి మాదిరిగా భయాలు ఉంటాయి. నేను భయపడే క్షణాలు ఉంటాయి. దాంతో నేను ఎప్పుడు అనుకొంటాను. ధైర్యం చేసి ముందడుగు వేయి.. పడిపోయినా.. ఫెయిల్ అయినా తగ్గేది లేదు అని నాకు నేను అనుకొంటాను. అలా అనుకొన్నాను కాబట్టే ఇంత దూరం రాగలిగాను. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా తగ్గేదేలే అని అనుకోవాలి అని అల్లు అర్జున్ తెలిపారు.