Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
అల్లు అర్జున్ కోసం 1000 మంది ఒకే షాట్ లో.. నెక్స్ట్ లెవల్ అంతే!
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప సినిమా యూనిట్ ఆసక్తికర ప్రకటన చేసింది. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం వెయ్యి మంది డాన్సుర్ లతో కాలు కదుపుతున్నారు అంటూ ఆ ప్రకటనలో పేర్కొంది.. ఆ వివరాల్లోకి వెళితే

ఎర్ర చందనం స్మగ్లింగ్
ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా పుష్ప.. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి సినిమా మీద ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ డిగ్లామర్ లుక్లో కనిపించబోతున్న కారణంగా అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే ఇతర సినీ ప్రేక్షకులకు కూడా విపరీతంగా ఈ సినిమా మీద ఆసక్తి పెంచుకున్నారు.

లారీ డ్రైవర్ పాత్రలో
ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తుండగా ఆయనకు జంటగా శ్రీ వల్లి అనే పాత్రలో రష్మిక మందన నటిస్తోంది. సుకుమార్ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏదైనా ఒక నేపథ్యం అనుకుంటే దాని మూలాల్లోకి వెళ్లి మరీ సినిమాను తెరకెక్కించడం సుకుమార్ అలవాటు. అలా వచ్చిన రంగస్థలం సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా మీద కూడా భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి

కీలక నటీనటులతో
దానికి తోడు ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫాజిల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతుండగా మొదటి భాగంలో తెలుగు కమెడియన్ సునీల్ విలన్ గా నటిస్తున్నాడు. సునీల్ భార్య పాత్రలో అనసూయ నటిస్తోంది. ఇలా అనేక మంది నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమా మీద ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా యూనిట్ నుంచి ఒక ఆసక్తికర ప్రకటన అయితే వెలువడింది.

వెయ్యి మంది డాన్సర్ లతో
అదేమిటంటే ఒక సాంగ్ షూటింగ్ కోసం ఏకంగా వెయ్యి మంది డాన్సర్ల తో షూటింగ్ జరుపుతున్నామని ప్రస్తుతం ఆ సాంగ్ షూటింగ్ జరుగుతోంది అని చెప్పుకొచ్చింది. మామూలుగానే అల్లు అర్జున్ డాన్స్ అంటే ఒక రేంజ్ లో ఉంటుంది దానికి తగ్గట్టు వెయ్యి మంది డాన్సర్ లతో వింటేజ్ లుక్ లో డాన్స్ అంటే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో అని బన్నీ అభిమానులైతే ఇప్పటినుంచి లెక్కలు వేసుకుంటున్నారు.
Recommended Video

ఆ విషయం కూడా క్లియర్
మైత్రి మూవీ మేకర్స్ మొత్తం శెట్టి మీడియా వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి భాగం డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.. తొలుత సినిమాను ఒక భాగంగానే విడుదల చేయాలని అనుకున్నా నిడివి బాగా పెరిగిపోవడంతో రెండు భాగాలుగా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ మధ్య హిందీ రిలీజ్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ నెలకొనగా అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వడంతో ఆ విషయం మీద కూడా క్లారిటీ వచ్చినట్లు చెబుతున్నారు.