Just In
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గంగోత్రి నుంచి ‘అల’.. ఒకే ఫ్రేమ్‌లో ప్రయాణం.. బన్నీ ట్వీట్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అల వైకుంఠపురములో సినిమాతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయ్. ఇన్నాళ్ల కెరీర్‌లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ చూసిన బన్నీ.. ఒక్క ఇండస్ట్రీ హిట్‌ను చూడలేకపోయాడు. ఎట్టకేలకు బన్నీ చిరకాల వాంఛ అయిన ఇండస్ట్రీ హిట్‌ను కొట్టేశాడు. అది కూడా తన తండ్రి అల్లు అరవింద్ నిర్మించిన అల వైకుంఠపురములో సినిమా కావడం మరింత సంతోషాన్నిస్తోంది.
అల వైకుంఠపురములో సక్సెస్ పార్టీలు బాగానే జరుగుతున్నాయి. ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ మీట్స్ జరుగుతూనే ఉన్నాయి. సక్సెస్ మీట్స్‌కు అయితే కొదవే లేదు. సినిమా విడుదలైనప్పటి నుంచి సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్‌ను పిలిచి.. ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు అల్లు అర్జున్. ఈ పార్టీ గురించి టాలీవుడ్‌లో పెద్ద చర్చే జరిగింది.

ఈ వేడుకలో బన్నీ మొదటి డైరెక్టర్ అయిత దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు నుంచి నిన్న మొన్న వచ్చిన యంగ్ దర్శకులు సైతం హాజరయ్యారు. అందరూ కలిసి దిగిన ఆ పిక్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయింది. దర్శకేంద్రుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి దిగిన ఫోటోను బన్నీ షేర్ చేస్తూ... గంగోత్రి నుంచి నేటి వరకు ఒకే ఫ్రేమ్‌లో తన ప్రయాణం అంటూ ట్వీట్ చేశాడు.
From Gangotri to Ala Vaikunthapurramuloo . My Journey in one frame . pic.twitter.com/iqXJo8SpzB
— Allu Arjun (@alluarjun) February 5, 2020