Allu arjun పిక్స్ వైరల్.. కూతురి కోసం ఏకంగా ఫామిలీతో అలా, అంతా కన్ఫ్యూజన్!

మెగా హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతున్నట్లు గా ఈ మధ్య ప్రకటన కూడా వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన తన కుమార్తె నటిస్తున్న శాకుంతలం సినిమా సెట్స్ లో సందడి చేశారు. సమంత అక్కినేని ప్రధాన పాత్రలో శాకుంతలం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ సినీ రంగ ప్రవేశం చేస్తుంది. ప్రస్తుతం ఆమె సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటోంది. నిజానికి అల్లు అర్జున్‌‌‌‌కు ఎంత క్రేజ్ ఉందో.. ఆయన పిల్లలు అల్లు అర్హ, అయాన్ కు కూడా సోషల్ మీడియాలో అంతే క్రేజ్ ఉంది. ఈ చిన్నారులు అప్పుడప్పుడూ తమ ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ఇప్పటికే అర్హ, అయాన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌‌‌లో అల్లు అర్హ జాయిన్ అయ్యింది. ఈ సినిమాలో భరతుడి చిన్నప్పటి పాత్రలో నటిస్తున్న అర్హ షూటింగ్ మొదలు కాకముందే కొన్ని క్లాసులకు కూడా హాజరై నటన మీద శిక్షణ తీసుకుంది కూడా. గుణశేఖర్ సారధ్యంలో ఈ క్లాసులు సాగాయి. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ తన భార్య స్నేహ అలాగే కొడుకు అల్లు అయాన్ తో కలిసి శాకుంతలం సెట్ కి వెళ్లారు. అక్కడ కూతురు నటిస్తున్న తీరు చూసి అల్లు అర్జున్ దంపతులు మురిసిపోతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Allu arjun visits shakuntalam movie shooting location for allu arha

ఈ ఫోటోలను ఎవరు తీశారో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వాటిని గుణశేఖర్ కి చెందిన గుణ టీమ్ వర్క్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నిజానికి అల్లు అర్జున్ నిన్ననే ఈ సినిమా సెట్స్ కు వెళ్ళారని అంటున్నారు. ఎందుకంటే నిన్ననే దేవ్ మోహన్ అల్లు అర్జున్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఆయన నిన్న షూటింగ్ కి వెళ్ళారా ? లేక ఈరోజు వెళ్ళారా ? అనే అంశం మీద కన్య్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాల్లో శకుంతలగా సమంత నటిస్తుండగా మలయాళం హీరో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక వీరిద్దరి ప్రేమకు జన్మించిన భరతుడి చిన్నప్పటి పాత్రలోనే అర్హ కనిపించనుంది. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల ఇప్పట్లో అయితే ఉండే అవకాశాలు కనిపించడం లేదు ఎప్పుడు రిలీజ్ చేస్తారు కూడా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి క్లారిటీ కనిపించడం లేదు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే క్రిస్మస్ కి థియేటర్లలో పుష్ప - ది రైజ్ (పార్ట్ 1) విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న మరియు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X