twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను యాక్టింగ్ లోకి రాకపోవడానికి అసలు కారణం ఇదే.. అదొక పెద్ద ఇబ్బంది: అల్లు బాబీ

    |

    టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఓకే ఫ్యామిలీకి చెందిన హీరోలు చాలామంది ఉన్నారు అయితే వారందరిలో కూడా మెగా హీరోలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద వారికంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్నారు. ఇక మెగా ఫ్యామిలీ బంధువు అయిన అల్లు ఫ్యామిలీ లో అల్లు అర్జున్ ఇటీవల పాన్ ఇండియా హీరోగా మరో స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే. అయితే అతని తమ్ముడు అల్లు శిరీష్ మాత్రం ఇంకా తెలుగులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ మాత్రం నటన వైపు అసలు రాలేకపోయాడు. నటించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అటువైపు ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్నకు ఇటీవల ఇంటర్వ్యూలో అల్లు బాబీ తన దైన శైలిలో వివరణ ఇచ్చాడు.

    తండ్రి బాటలోనే..

    తండ్రి బాటలోనే..

    అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అతని ముద్దు పేరు బాబి. చాలా ఏళ్ళుగా అతను గీతా ఆర్ట్స్ లో అనేక రకాల సినిమాలకు ప్రొడక్షన్ లో కూడా వర్క్ చేయడం జరిగింది. కానీ ఆ విషయం బయటకు తెలియలేదు. ప్రస్తుతం తండ్రికి తగ్గ తనయుడిగా నిర్మాతగా మంచి గుర్తింపు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక వరుణ్ తేజ్ తో తీసిన మొదటి సినిమా గని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు.

    అవకాశాలు వచ్చినప్పటికీ..

    అవకాశాలు వచ్చినప్పటికీ..

    అల్లు అర్జున్ అలాగే అల్లు శిరీష్ మిగతా మెగా హీరోలు అందరూ కూడా నటులుగా ఇండస్ట్రీలో వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. అయితే ఒకానొక సమయంలో అల్లు బాబీ కి కూడా సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. గత ఏడాది వరకు కూడా ఆయనకి సినిమాల్లో డిఫరెంట్ పాత్రలో నటించే అవకాశం కూడా వచ్చిందట. కానీ వాటిని సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.

    నటన వైపు వెళ్లకుండా..

    నటన వైపు వెళ్లకుండా..

    కాస్త కష్టపడినా కూడా సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు అందుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సహనటులుగా నటిస్తే కూడా మంచి ఆదాయం కూడా లభిస్తుంది అనే పాయింట్ తనకు కూడా తెలుసు అని కాకపోతే అసలు నటనవైపు ఏమాత్రం వెళ్ళకూడదు అని ఒక బలమైన నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాను అని వివరణ ఇచ్చాడు.

    అందుకే యాక్టింగ్ వద్దని..

    అందుకే యాక్టింగ్ వద్దని..

    సాధారణంగా ఒక సారి స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత నటీనటులందరూ కూడా బయటకు వెళితే వాళ్ల అందరికీ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందరూ వారిని చూసేందుకు ఎగబడతారు. అది నాకు తెలుసు. అయితే పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చేసరికి వారికి చాలా తక్కువగా ప్రైవసీ ఉంటుంది. స్వేచ్ఛగా వాళ్ళు బయట తిరగలేరు. కానీ నేను మాత్రం ఇష్టానుసారంగా ఎప్పుడైనా బయటకు వెళ్లి ఒక టీ తాగి వస్తాను. నాకు నచ్చినట్లు విశాల ప్రపంచంలో ఉండగలుగుతాను. ఒక స్టార్ ఇమేజ్ ఉంటే మాత్రం ఆ విధంగా స్వేచ్ఛగా బతకలేను అనుకోని అందుకే యాక్టింగ్ వద్దు అని చిన్నప్పుడే నిర్ణయించుకున్నానని బాబి వివరణ ఇచ్చాడు

    English summary
    allu bobby clarification on why he is not interested in acting
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X