Allu Sirish - Nayanika: నయనికతో పరిచయం అలా.. లవ్ స్టోరీ లీక్ చేసిన అల్లు శిరీష్!
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరిగా ఉన్న మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్నకుమారుడు అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రియురాలు నయనిక మెడలో ఆయన త్వరలో మూడు ముళ్లు వేయనున్నారు. అక్టోబర్ 31వ తేదీ నయనిక - అల్లు శిరీష్‌ల ఎంగేజ్‌మెంట్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా- అల్లు కుటుంబాలతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు డజను మంది హీరోలు, నిర్మాతలు, నిర్మాణ సంస్థలు తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నిలదొక్కుకుంటున్నారు. అలా అల్లు శిరీష్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎంత కష్టపడుతున్నా శిరీష్‌కు బ్రేక్ మాత్రం రావడం లేదు. శిరీష్‌ను నిలబెట్టాలని అల్లు అరవింద్, అల్లు అర్జున్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గౌరవం, కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు శిరీష్. ప్రస్తుతం ఆయన నుంచి ఏ కొత్త ప్రాజెక్ట్ రావడం లేదు.

అయితే గత కొంతకాలంగా అల్లు శిరీష్ పెళ్లి గురించి మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. తర్వాత ఇవి గాలి వార్తలుగానే మిగిలిపోయాయి. అయితే కొద్దిరోజుల క్రితం ఓ అమ్మాయి చేతిలో చెయ్యేసి నడుస్తూ వెళ్తున్న ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. దాంతో అల్లు శిరీష్ ప్రేమలో పడ్డారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు గుప్పుమన్నాయి. అల్లు వారింటికి కాబోయే కోడలు ఎవరు? వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ ఎప్పుడు? అంటూ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. దీనికి నిజం చేస్తూ అల్లు కుటుంబం ఎంగేజ్‌మెంట్‌కు ప్లాన్ చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో తుఫాను కారణంగా వీరి నిశ్చితార్ధం వాయిదా పడింది. చలికాలంలో ఔట్‌డోర్ నిశ్చితార్దం ప్లాన్ చేశాను.. కానీ వాతావరణం, దేవుడికి వేరే ప్లాన్ ఉన్నాయంటూ శిరీష్ పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది.
వాతావరణం అనుకూలించడంతో ఆ మరుసటి రోజే నయనికతో అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అయితే వీరి పెళ్లి ఎప్పుడు? ఇండియాలో చేసుకుంటారా? ఫారిన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా? అంటూ సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతా బాగానే ఉంది కానీ అసలు నయనికకు, అల్లు శిరీష్‌కు ఎప్పుడు? ఎక్కడ పరిచయం జరిగింది? ఎలా వారిద్దరూ ప్రేమలో పడ్డారు? అనే చర్చ మొదలైంది. తాజాగా ఈ డిస్కషన్‌కి తెరదించారు అల్లు శిరీష్.
వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల పెళ్లి రోజు కావడంతో ఈ జంటకు అల్లు శిరీష్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా తాను నయనికను ఎలా కలిసిందో కూడా బయటపెట్టారు శిరీష్. 2023 అక్టోబర్‌లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లిని పురస్కరించుకుని నితిన్, శాలిని కందుకూరిలు ఓ పార్టీ ఇచ్చారు. ఈ ఈవెంట్‌కు శాలిని.. తన ఫ్రెండ్ అయిన నయనికను కూడా ఇన్వైట్ చేసింది. అప్పుడే మేమిద్దరం తొలిసారిగా కలుసుకున్నాం.. ఆ తర్వాత ప్రేమలో పడి, ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నామని శిరీష్ వెల్లడించారు. రేపు మా పిల్లలు .. మా ఇద్దరి లవ్ స్టోరీ గురించి అడిగితే, మీ అమ్మను ఇలాగే కలిశానని చెబుతానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











