Don't Miss!
- Technology
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- News
YS Jagan, Chandrababu : జగన్, చంద్రబాబుకూ సంక్షేమ సవాల్ ! లబ్దిదారుల డిమాండ్లు ఇవే..!
- Finance
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఆరుబయట నవారు మంచమెక్కిన బన్నీ.. పిల్లలతో ముచ్చటిస్తున్న వీడియో వైరల్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీకి ఎంత వ్యాల్యూ ఇస్తాడో మనందరికీ తెలిసిందే.. సినిమాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన ఏ మాత్రం సమయం దొరికినా పిల్లలతో గడపడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తన పిల్లలు అల్లరిని సోషల్ మీడియా వేదికగా అందరికీ షేర్ చేస్తూ మురిసిపోతూ ఉంటాడు. తాజాగా కరోనా సెకండ్ వేవ్ ధాటికి దాదాపు తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లి పోయాయి. ఈ నేపథ్యంలోనే సినిమా స్టార్స్ అందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక పిల్లలతో గడిపేందుకు తగినంత సమయం దొరకడంతో బన్నీ కూడా చిన్నపిల్లాడిలా మారిపోతున్నాడు.
తాజాగా అల్లు అర్జున్ తన పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హలతో ఆరు బయట నవారు మంచం మీద పడుకొని ముచ్చటిస్తున్న వీడియోని అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అల్లు అర్జున్ సరదాగా పిల్లలతో మాట్లాడుతూ ఆకాశంలో ఏదో చూపిస్తున్నట్లుగా ఉంది. దీంతో ఈ వీడియో చూసి అల్లు అరవింద్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.

ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తయ్యాక కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. కానీ ఆచార్య తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు కొరటాల. దీంతో ఇప్పుడు బన్నీ 21వ సినిమా ఎవరితో చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. బన్నీ కోసం వేణు శ్రీరామ్ మొదలుకొని ప్రశాంత్ నీల్ వరకు పలువురు దర్శకులు కథలు సిద్ధం చేయగా ఆయన ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.