Just In
- 3 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 5 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘అల్లుడు అదుర్స్’కు బడా డైరెక్టర్ సాయం: తప్పులు సరిదిద్దేందుకు రంగంలోకి!
వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న సమయంలో 'రాక్షసుడు' సినిమాతో కెరీర్‌లోనే మొట్టమొదటి భారీ విజయాన్ని అందుకున్నాడు బెల్లంకొండ వారి అబ్బాయి సాయి శ్రీనివాస్. ఈ మూవీ ఫలితం ఇచ్చిన జోష్‌తో అతడు ప్రస్తుతం ఎనర్జిటిక్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్‌తో 'అల్లుడు అదుర్స్' అనే సినిమా చేశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని చిత్ర యూనిట్ రంగంలోకి దింపిందని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. రెండు రోజుల క్రితమే 'అల్లుడు అదుర్స్' సినిమాను అనిల్ రావిపూడికి చూపించిందట చిత్ర యూనిట్. ఆ సమయంలో సినిమాలోని కొన్ని సీన్స్ కత్తిరిస్తే బాగుంటుందని అతడు.. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌కు చెప్పాడని తెలిసింది. అందుకు అనుగుణంగా ఎడిటింగ్ వర్క్ కూడా చేశారని అంటున్నారు. అంతేకాదు, సినిమాకు సంబంధించిన కొన్ని పనుల్లోనూ ఆయన యాక్టివ్‌గా ఉండడంతో పాటు ఎంతో సాయం చేశాడని సమాచారం. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ చేయి పడడంతో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని యూనిట్ ఫుల్ ధీమాగా ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'అల్లుడు అదుర్స్'. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గొర్రెల సుబ్రమణ్యం నిర్మిస్తోన్న ఈ సినిమాలో నభా నటేష్, అను ఇమాన్యుయల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అలాగే, రియల్ హీరో సోనూ సూద్ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఇది విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమాలోని పాటలు, టీజర్, ట్రైలర్‌కు విశేషమైన స్పందన రావడంతో బెల్లంకొండ సాయి మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.