‘అల్లుడు అదుర్స్’ నుంచి సర్‌ప్రైజ్ పోస్టర్: రియల్ హీరోను హైలైట్ చేస్తూ వదిలారు

బడా నిర్మాత కొడుకుగా సినిమాల్లోకి ప్రవేశించాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆరంభం నుంచి భారీ చిత్రాల్లోనే నటిస్తున్నప్పటికీ సరైన హిట్‌ను మాత్రం దక్కించుకోలేకపోయాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'జయ జానకీ నాయక' పర్వాలేదనిపించినా.. సూపర్ హిట్‌గా నిలవలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో 'రాక్షసుడు' ద్వారా కెరీర్‌లో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు బెల్లంకొండ వారి అబ్బాయి. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం అతడు 'అల్లుడు అదుర్స్' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ పోస్టర్ రిలీజ్ అయింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - ఎనర్జిటిక్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'అల్లుడు అదుర్స్'. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గొర్రెల సుబ్రమణ్యం నిర్మిస్తోన్న ఈ సినిమాలో నభా నటేష్, అను ఇమాన్యుయల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అలాగే, రియల్ హీరో సోనూ సూద్ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. నూతన సంవత్సర కానుకగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో చిత్ర హీరో శ్రీనివాస్‌తో పాటు సోనూ సూద్‌ను హైలైట్ చేశారు. దీంతో ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

Alludu Adhurs New Year Poster: Bellamkonda and Sonu Sood Highlight

ఇదిలా ఉండగా... ఈ సినిమాలో బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఇటీవలే దీనికి సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నేతృత్వంలో జరిగిన షూటింగ్‌లో హీరో హీరోయిన్లతో పాటు సోనూ సూద్ కూడా డ్యాన్స్ చేయడం విశేషం. ఇక, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభిచాలని భావిస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X