ఆమనికి జీవిత రాజ‌శేఖ‌ర్ సపోర్ట్.. స్త్రీ శక్తిని ఎవ్వరూ ఆపలేరంటూ కామెంట్స్

ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌లో సీనియ‌ర్ హీరోయిన్ ఆమ‌ని ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కెతున్న చిత్రం 'అమ్మ‌దీవెన‌'. ఎత్తరి మార‌య్య‌, ఎత్తరి చిన మారయ్య, ఎత్తరి గుర‌వ‌య్యలు కలసి నిర్మిస్తున్న ఈ సినిమాకు శివ ఏటూరి ద‌ర్శ‌క‌త్వం వహించారు. తాజాగా ఈ చిత్రం ట్రైల‌ర్‌ని సీనియ‌ర్ హీరోయిన్ జీవిత రాజ‌శేఖ‌ర్ విడుద‌ల చేశారు.

ఈ సందర్భంగా జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ... ''అమ్మ దీవెన డైరెక్టర్ శివ, గురువయ్య గారికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. ఈ చిత్ర హీరోయిన్ ఆమని మంచి నటి, రాజశేఖర్ గారితో అమ్మాకొడుకు మూవీలో నటించినప్పటి నుండి ఆమని గారు నాకు పరిచయం. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మేము ఆమని మంచి హీరోయిన్ అవుతుందని అనుకున్నాము. పెళ్లి తరువాత కూడా మంచి చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది.

Amma Deevena Trailer Launch: Jeevitha Comments

ఈ మధ్య కాలంలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తగ్గాయి. మళ్లీ కొత్త దర్శకులు సమంత, తాప్సి వంటి వారితో మంచి సినిమాలు తీస్తున్నారు. స్త్రీ శక్తిని ఎవ్వరూ ఆపలేరు. అమ్మదీవెన సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.

ఈ సినిమా అందరి ఆధర అభిమానులు పొందాలని ఆశిస్తున్నాను'' అన్నారు. అమ్మదీవెన సినిమాలో ఆమని లీడ్ రోల్ పోషించగా.. పోసాని కృష్ణమురళి, నటరాజ్, శ్రీ పల్లవి, శరణ్య, సత్యప్రకాష్, శృతి, డి.ఎస్ రావు, యశ్వంత్, నానియదవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X