విజయ్ దేవరకొండ తమ్ముడు తొలి చిత్రం ‘దొరసాని’ రిలీజ్ డేట్ ఫిక్స్

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్లో అతితక్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజికి ఎదిగిన విజయ్ దేవరకొండ వారసత్వంతో త్వరలో ఆయన సోదరుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. 'దొరసాని' అనే సినిమా ద్వారా విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.

'దొరసాని'లో ఆనంద్ దేవరకొండకు జోడీగా హీరో రాజశేఖర్‌ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. 'పెళ్లి చూపులు' నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Anand Deverakonda, Sivatmika debut film Dorasani release date

జులై 5వ తేదీన 'దొరసాని' రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తెలంగాణ విలేజ్ ప్రాంతానికి సంబంధించిన కథతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.

షార్ట్ ఫిల్మ్ మేకర్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ఇద్దరూ నటనకు కొత్త కావడంతో సినిమా మొదలవ్వడానికి ముందే యాక్టింగ్ వర్క్ షాపులో శిక్షణ తీసుకున్నారు. సినిమా కథకు తగిన విధంగా తెలంగాణ స్లాంగ్, యాక్టింగ్ స్కిల్స్ ఇందులో నేర్పించారట.

తన సోదరుడు హీరోగా పరిచయం కాబోతున్న మూవీ కావడంతో విజయ్ దేవరకొండ 'దొరసాని' ప్రమోషన్లలో కీలకంగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ మూడో వారం నుంచి 'దొరసాని' ప్రమోషన్స్ షురూ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X