Don't Miss!
- Finance
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు.. సంక్షేమంలో ముందుకే..
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- News
అమరావతి కేసు విచారణ-సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ ? ఫాస్ట్ ట్రాక్ విజ్ఞప్తి, ఫిర్యాదుల నేపథ్యం !
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Sports
SA20 : దంచికొట్టిన సన్రైజర్స్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన క్యాపిటల్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మనుషులంటేనే ఒక చెత్త.. ఇలాంటి పైశాచిక పనులు ఎలా చేస్తారు.. యాంకర్ అనసూయ ఆగ్రహం
టాలీవుడ్ స్టార్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అనసూయ భరద్వాజ్. లాక్ డౌన్ కారణంగా బుల్లితెర షూటింగ్ లకు కాస్త దూరమైన ఈ జబర్దస్త్ యాంకర్ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా జనాలను ఎట్రాక్ట్ చేస్తూనే ఉంది. ఇక పలు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తోంది. ఇక రీసెంట్ గా కొందరు చేసిన పనికి ఏనుగు ప్రాణాలు విడువడంతో అనసూయ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

అనసూయ ఆగ్రహం..
సాధారణంగా అనసూయ మనుషులు చేసే పొరపాట్లు, తప్పుల గురించి ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు. ఇక తనపై వచ్చే రూమర్స్ కు కూడా కౌంటర్ ఇవ్వడం ఈ యాంకర్ గా అలవాటే. అయితే ఇటీవల ఒక అడవి జీవిపై జనాలు చూపించిన క్రూరత్వంపై అనసూయ తీవ్ర స్థాయిలో మండిపడింది. అసలు మనిషి పుట్టకంత చెత్తది మరొకటి లేదని ట్వీట్ చేసింది.

ఆకలితో వచ్చిన ఏనుగు..
అసలు మ్యాటర్ లోకి వెళితే.. కేరళలో ఒక అడవిలో గర్భంతో ఉన్న ఏనుగు ఆకలికి తట్టుకోలేక జనాలు ఉన్న గ్రామాల్లోకి వచ్చింది. అయితే అది ఎవరికి హాని చేయలేదు. ఆకలి కోసం వచ్చిందని స్థానికులు తెలుసుకున్నారు. ఏనుగుకు పైనాపిల్ ఇవ్వగా అది నిదానంగా తింటుండగా ఒక్కసారిగా భారీగా గాండ్రించింది. అందుకు కారణం ఆ పండులో స్థానికులు టపాసులు పెట్టి ఇచ్చారు.

ఏనుగు మరణం..
క్రాకర్స్ ధాటికి ఏనుగు నోటిలో తీవ్ర గాయమైంది. అప్పుడు అది నీళ్ల కోసం ఒక నదికి వెళ్లి నీళ్లు తాగే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే ఏనుగు మృతి చెందింది. ఈ విషయం గురించి ఒక కథనాన్ని షేర్ చేస్తూ యాంకర్ అనసూయ ఏనుగు మరణానికి కారణమైన వారిపై తీవ్ర స్ఫయిలో మండిపడింది.
Recommended Video

మానవజాతి ఒక చెత్త..
ఖచ్చితంగా మనం అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాము. మానవజాతి ఒక చెత్త రకం. మన జీవితం మొత్తం తప్పుగానే ఉన్నాం. అడవి దైవంతో సమానం. నాగరికత అనేది ఒక దెయ్యం. నిజంగా ఈ ఘటన చాలా వేదనను కలిగిస్తోంది. ఎవరైనా సరే ఇలాంటి తప్పుడు పనులను ఎలా చేయగలరు అంటూ అనసూయ ట్వీట్ చేసింది.