twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kathi Maheshకి అండగా వైఎస్ జగన్... హాస్పిటల్ ఖర్చుల కోసం భారీ ఆర్ధిక సాయం

    |

    ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం గురించి ఇప్పటికే రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన భారీ సాయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే

    సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో

    సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో

    విజయవాడ నుంచి స్వస్థలం పీలేరు వెళుతున్న కత్తి మహేష్ కారు రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. ఎదురుగా వెళ్తున్న ఒక లారీని అనుకోకుండా ఢీకొనడంతో డ్రైవింగ్ చేస్తున్న సురేష్ వైపు ఉన్న ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంతో ఆయనకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. కానీ కత్తి మహేష్ సీట్ బెల్ట్ పెట్టకపోవడంతో ఎయిర్ బ్యాగ్ తెరుచుకోలేదు, దీంతో ఆయన ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.

    శస్త్రచికిత్స

    శస్త్రచికిత్స

    తెల్లవారు జాము సమయంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సురేష్, ప్రమాదం జరిగింది కత్తి మహేష్ కి అని పోలీసులకు వెల్లడించడంతో అప్పటికప్పుడు ఆయనని నెల్లూరులో ఉన్న మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. అయితే ఆయన కళ్ళు పూర్తిగా దెబ్బతినడంతో ముందుగా శస్త్రచికిత్స చేసి అప్పటికప్పుడు ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

    అండగా జగన్

    అండగా జగన్

    అక్కడే మహేష్ కు గత కొద్ది రోజులుగా చికిత్స జరుగుతుంది. ఇప్పటి వరకు హాస్పిటల్ బిల్లులు అన్నీ మహేష్ కత్తి కుటుంబమే భరిస్తూ వచ్చినట్లు ఆయన స్నేహితులు వెల్లడించారు. ఇన్సూరెన్స్ పాలసీలు క్లైమ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఏపీ సీఎం జగన్ కు స్ట్రాంగ్ సపోర్టర్ గా ఉన్న ఆయనకు వైఎస్ జగన్ ఆర్థిక సాయం ప్రకటించారు. కత్తి మహేష్ హాస్పిటల్ ఖర్చుల కోసం ఏకంగా 17 లక్షలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.

    కాన్సియస్ గానే మహేష్

    కాన్సియస్ గానే మహేష్


    ఈ మేరకు అధికారికంగా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి అపోలో హాస్పిటల్స్ కు లేఖ విడుదలైంది. కత్తి మహేష్ కి సంబంధించిన ఆరోగ్య వివరాలను వెంకట్ సిద్ధారెడ్డి అలాగే మరో రచయిత అరుణాంక్ లత ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. వారు అందించిన తాజా సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహేశ్ బావున్నాడు. కాన్సియస్ గా కూడా ఉన్నాడు. మాటలు వింటున్నాడు. రెస్పాండ్ కూడా అవుతున్నాడని వారు 30వ తేదీన వెల్లడించారు.

    దేవుడెలా అవుతాడు ?

    దేవుడెలా అవుతాడు ?

    దేవుడిని నమ్మే మీరు, తనని ఏదో అన్నాడని పగ తీర్చుకుంటాడని నమ్మే మీరు - ఒకసారి మీ నమ్మకాలను మళ్ళీ పరిక్షించుకోండని వెంకట్ సిద్దారెడ్డి పేర్కొన్నారు. దేవుడు ఉన్నాడని మీరు నిజంగా నమ్ముతుంటే, ఒకవేళ అలాంటి దేవుడు ఉండే ఉంటే, ఆ దేవుడు ఖచ్చితంగా కరుణ, దయ కలిగిన వాడై ఉంటాడని అన్నారు. అలాంటి గుణం లేని వాడు అసలు దేవుడెలా అవుతాడు ? అని ఆయన ప్రశ్నించారు.

    English summary
    Kathi Mahesh has been admitted at Apollo hospital in Chennai. Recently AP CM YS Jaganmohan Reddy has decided to help him through CM Relief Funds and released an amount upto 17 lakh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X