మెగాస్టార్ లుక్ పై అలాంటి రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తున్నారు. కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ మరింత జోరుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రాలపై మరింత ఆసక్తి నెలకొంది. కాగా ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అప్ కమింగ్ ఫిల్మ్స్ నుంచి అదిరిపోయే అప్డేట్స్ అందాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మెగా157 టైటిల్ ను అనౌన్స్ చేయడం విశేషం.
అనిల్ రావిపూడి - మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో మెగా 157 చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ బ్యానర్లపై చిరంజీవి తనయ కొణిదెల సుష్మిత నిర్మిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం అవుట్ పుట్ అదిరిపోయేలా ఉండాలని, సినిమా నిర్మాణం విషయంలో ఎలాంటి తేడాలు రాకూడదని అనిల్ కు, నిర్మాత సుష్మితకు సూచించారు మెగాస్టార్. ఆ మేరకు పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇదెలా ఉంటే.. మెగా స్టార్ రాబోయే చిత్రాలోన్ని లుక్ పై కొంత దుష్ప్రచారం జరుగుతోంది.

మెగాస్టార్ యంగ్ లుక్, డీ ఏజీంగ్ అంతా గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ లో చేస్తున్నారంటూ కొందరు రూమర్లు క్రియేట్ చేస్తూ వస్తున్నారు. అయితే దీనిపై తాజాగా అనిల్ రావిపూడి స్పందించడం ఆసక్తికరంగా మారింది. మెగా157 టైటిల్ రిలీజ్ ఈవెంట్ లో ఇలా మాట్లాడారు. 'చిరంజీవి సినిమాలను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. ఆయనతో సినిమా చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని కొన్నేళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఎట్టకేలకు ఇప్పుడు ఆ అవకాశం దక్కింది.
ఇక టైటిల్ ను కూడా చిరంజీవి గారి ఒరిజినల్ పేరులోని శంకరవరప్రసాద్ గానే పెట్టడానికి కారణం ఆయనపై ఉన్న అభిమానమే. ఇక చిత్రంలోని పాటలు, సాంగ్స్, డ్యాన్స్, యాక్షన్ అన్నీ అద్భుతంగా వచ్చాయి. ఇప్పటి వరకు టీమ్ అంతా సాటిస్ఫై అవుతోంది. మున్ముందు ఇంకా అదిరిపోతుంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ గారి ఎంట్రీ కూడా ఉంది. ఇక చిరంజీవి గారి సూట్ లో స్టైలిష్ గా చూడాలని నా కోరిక. అందుకే ఈ చిత్రంలో ఫుల్ స్టైలిష్ గా, కొత్త అటిట్యూడ్ తో కనిపిస్తారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు.
మరీ ముఖ్యంగా చిరంజీవి గారు ఫిట్ నెస్, ఆయన యంగ్ లుక్ మాత్రం వాస్తవమే. నేచురల్ గానే బాస్ ను చూపిస్తున్నాం. ఎలాంటి గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వంటివి ఎక్కువగా వాడటం లేదు. నిజంగానే చిరంజీవిగారూ ఇప్పటికీ చూడటానికి 45 ఏళ్ల వారిలా ఉన్నారు. అందుకు కారణం ఆయన ఫాలో అవుతున్న డైట్, ఎక్సర్ సైజ్ లే. అంతకు మించి మరేమీ లేదు. ఇక సినిమాకు భీమ్స్ మంచి సంగీతం అందించారు. మున్ముందు స్టెప్ బై స్టెప్ అప్డేట్స్ ను అందిస్తూ వస్తాం.' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











