For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NBK108: అసలైంది లీక్ చేసిన అనిల్ రావిపూడి.. బాక్సాఫీస్ ఊచకోత ఖాయం

  |

  దాదాపు నలభై సంవత్సరాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలతో సందడి చేస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న ఆయన.. గత ఏడాది వచ్చిన 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మరింత జోష్‌తో కనిపిస్తున్నారు. ఇక, ఈ సంక్రాంతికి గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'వీరసింహారెడ్డి' అనే సినిమాతో వచ్చారు. దీనికి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లను వసూలు చేయడంతో పాటు సూపర్ డూపర్ హిట్ అయింది.

  Suhana Khan: అందాల ఆరబోతతో షారుఖ్ కూతురు రచ్చ.. షార్ట్ డ్రెస్‌లో యమ హాట్‌గా!

  నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలో రూపొందిన 'వీర సింహా రెడ్డి' మూవీ భారీ కలెక్షన్లను సాధిస్తుండడంతో చిత్ర యూనిట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో 'వీరసింహుని విజయోత్సవం' పేరిట ఓ సక్సెస్‌ను మీట్‌ను నిర్వహించింది. దీనికి చిత్ర యూనిట్ సభ్యులతో పాటు ఎంతో మంది దర్శకులు, యంగ్ హీరోలు కూడా హాజరయ్యారు. ఇక, ఈ వేడుకకు వచ్చిన బాలయ్య 108వ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు. 'సాధారణంగా రెయినీ సీజన్, వింటర్ సీజన్ నడుస్తుంది అంటారు. కానీ, ఇప్పుడు NBK సీజన్ నడుస్తోంది. ఆయన వరుసగా బ్లాక్ బస్టర్ కొట్టి ఊపులో ఉన్నారు' అని చెప్పుకొచ్చాడు.

  Anil Ravipudi Reveals Balakrishna Movie Backdrop at Veerasimhune Vijayotsavam Event

  ఆ తర్వాత అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. 'బాలయ్య బాబు బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్లు కొట్టారు. ఇంక ఆయన ఆగరు. అంతే అన్‌స్టాపబుల్. బాలయ్య గారితో సినిమా ఒక షెడ్యూల్ చేశాం. ప్రతిసారి ఆయన అభిమానులను దృష్టిలో ఉంచుకునే మాట్లాడతారు. వాళ్లకు నచ్చినట్లు చేయమంటారు. అందుకే ఆయన ప్రతి సినిమాలోనూ NBK టచ్ ఉంటుంది. రేపు రాబోయే 108వ మూవీలోనూ ఇది ఉంటుంది. అయితే, అన్న ఈ సారి రాయలసీమలో కాదు.. తెలంగాణలో దిగుతుండు. బాక్సాఫీస్ ఊచకోత షురూ చేస్తడు. కలెక్షన్లతో ఖుర్భానీ పెడతడు. గెట్ రెడీ' అంటూ తన సినిమా బ్యాగ్‌డ్రాప్ గురించి లీక్ చేశాడు.

  పైట తీసేసి పచ్చిగా హీరోయిన్ ఫోజులు: ఉప్పొంగిన అందాలతో రెచ్చగొడుతూ!

  ఇదిలా ఉండగా.. అనిల్ రావిపూడితో బాలయ్య చేసే సినిమాను షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక జావాల్కర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీలీలా ఆయన కూతురిగా నటిస్తుందని అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది.

  English summary
  Veera Simha Reddy Unit Conducted Veerasimhune Vijayotsavam Event Last Night. Anil Ravipudi Reveals Balakrishna Movie Backdrop at This Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X