Just In
- 30 min ago
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- 57 min ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 1 hr ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
- 2 hrs ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
Don't Miss!
- Automobiles
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వారిద్దరి మధ్య ఎవ్వరూ ఊహించని సీన్స్.. నిర్మాత సెన్సేషనల్ కామెంట్స్
పదమూడేళ్ల తరువాత సీనియర్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ విజయశాంతి తిరిగి సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడంతో సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఓ వైపు భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు.. అనిల్ రావిపూడితో కలిసి చేస్తోన్న సరిలేరుపై మరింత హైప్ క్రియేట్ ఏర్పడింది. ఈ మూవీ రిలీజ్‌కు దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచింది చిత్రయూనిట్.

భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్..
జనవరి 5న ఎల్బీ స్టేడియంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నట్లు ప్రకటించారు. తనకు కలిసి వచ్చిన ఆ స్టేడియంలో ఈ మూవీ ఈవెంట్‌ను చేయాలని మహేష్ భావించాడు. భరత్ అనేనేను ఈవెంట్‌ను అక్కడే జరపగా.. ఆనాడు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.అయితే ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరుకాబోతోన్నాడు.

కశ్మీర్‌లో అలా షూటింగ్..
ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా అనిల్ సుంకర మాట్లాడుతూ.. ఈ సినిమా షూట్ కోసం యూనిట్ మొత్తం కశ్మీర్ వెళ్లామని తెలిపాడు. ఆ సమయంలో ‘ఆర్టికల్ 370'ని రద్దు చేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం భద్రత కట్టుదిట్టం చేసిందని పేర్కొన్నాడు. తమ వ్యాన్‌లు అన్ని ఆగిపోయాయని, ఆర్మీ మేజర్లు చాలా సహాయం చేశారని తెలిపాడు.

మహేష్ బాబు తెలియడంతో..
మన డబ్బింగ్ సినిమాల్ని వారు చూస్తుంటారట... మహేశ్ బాబు అక్కడి వారికి తెలిసి ఉండటం వల్ల ఈ సినిమాకు కలిసి వచ్చిందని తెలిపాడు. అంత భద్రత ఎందుకు ఉందో అప్పుడు అర్థం కాలేదనీ, ఆ తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేశారని అన్నాడు.

ఎవ్వరూ ఊహించని విధంగా..
13 సంవత్సరాల తర్వాత విజయశాంతిగారు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నాడు. అవార్డు విన్నింగ్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారని కొనియాడాడు. మహేష్, విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయని తెలిపాడు. అసలు వారిద్దరి కాంబినేషనే పెద్ద సెల్లింగ్ ఫ్యాక్టర్ అని అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్‌కి ప్రేక్షకుల నుండి విజిల్స్, క్లాప్స్ పడుతూనే ఉంటాయని, అవి లేనిచోట కన్నీళ్ళు పెడతారని అన్నాడు.