twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏ సీఎంలను పిలవడం లేదు.. ఆయనే మాకు పెద్ద దిక్కు.. నాగ్ కామెంట్స్

    |

    Recommended Video

    Akkineni Nagarjuna Press Meet On ANR Awards

    స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డుల ప్రధానోత్సవం ఏటా ఘనంగా జరుగుతుందన్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల గతేడాది ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయాని కళాబంధు టీ సుబ్బిరామిరెడ్డి, నాగార్జున తెలిపారు. అయితే 2108, 2019 సంవత్సరానికి గానూ ఏఎన్నార్ జాతీయ అవార్డులను ప్రకటించారు. ఈ మేరకు ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరువురు మాట్లాడుతూ.. అనేక విషయాలను వెల్లడించారు.

    మా కుటుంబానికి పెద్ద దిక్కు..

    మా కుటుంబానికి పెద్ద దిక్కు..

    నాగ్ మాట్లాడుతూ.. ‘ఇది మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం.. ఈ కార్యక్రమం ఇంత పెద్ద విజయం సాధించడానికి టీఎస్సార్ ఒక కారణం.. ఆయన మా నాన్నకు క్లోజ్ ఫ్రెండ్.. నాక్కూడా క్లోజ్ ఫ్రెండ్.. మా నాన్న చనిపోయాక.. మా ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా ఉన్నారు.. నాకు ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా.. ఆయన ఏ సమయంలోనైనా రెస్పాండ్ అవుతారు. సుబ్బిరామి రెడ్డిగారికి థ్యాంక్స్..

    చిరు చేతుల మీదుగా..

    చిరు చేతుల మీదుగా..

    ఈ కార్యక్రమంలో భాగంగానే.. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ విద్యార్థులకు పట్టాలు అందజేస్తున్నాము. చివరగా అమితాబ్‌, రాజమౌళి కొంతమంది విద్యార్థులకు అందజేశాము. ఈ సారి రేఖ చేతుల మీదుగా ప్రధానం చేస్తాము. రేఖ గారికి ఫోన్ చేసిన వెంటనే వస్తానని చెప్పారు. చిరంజీవి చేతుల మీదుగా 2018 - శ్రీదేవీ, 2109 -రేఖకు అవార్డును ప్రధానం చేయనున్నాము. అవార్డులో భాగంగా ఐదు లక్షలు ఇస్తామని, మొదటి నుంచి అదే పాటిస్తున్నాము.. ఇక్కడ డబ్బు ప్రధానం కాదు.. అవార్డు ముఖ్యమ'ని అన్నారు. మీడియా అడిగిన ప్రశ్నకు గానూ.. ఈ కార్యక్రమానికి ఏ సీఎంలను పిలవడం లేదని చెప్పారు.

    మొదటగా లతా మంగేష్కర్..

    మొదటగా లతా మంగేష్కర్..

    టీఎస్సార్ మాట్లాడుతూ.. ‘ఏఎన్నార్ గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు.. తన పేరు మీద కూడా ఓ అవార్డును ప్రకటించాలని, గొప్ప వారికి వాటిని బహూకరించాలని అన్నారు.. ఆ కమిటీ నన్ను చైర్మన్‌గా ఉండమని కోరారు.. అలా మొదటగా లతా మంగేష్కర్ గారికి ఇచ్చాము.. ఆ తరువాత దేవానంద్, వైజయంతీ మాల, హేమా మాలిని, శ్యామ్ బెనెగళ్, కె బాలచందర్, అమితాబ్, రాజమౌళి.. ఇలా సినీ పరిశ్రమకు ఎనలేని కృషి చేస్తున్నవారికి అందిస్తూ వస్తున్నాము. దాన్ని ఆయన కుమారుడు నాగార్జున ఎంతో బాధ్యతతో ముందుకు తీసుకెళ్తున్నారు.

    శ్రీదేవీ, రేఖలకు ఏఎన్నార్ జాతీయ అవార్డు

    శ్రీదేవీ, రేఖలకు ఏఎన్నార్ జాతీయ అవార్డు

    ఈ సందర్భంలో నాగార్జునను మెచ్చుకోవాలి.. తండ్రి కోరికను, ఆలోచననలను ముందుకు తీసుకెళ్తూ ఎంతో మంచి పనులు చేస్తున్నారు. ఈ కాలంలో తల్లిదండ్రులంటే ప్రేమ ఉంటుంది.. తరువాత మరిచిపోతారు.. కానీ వారి కోరికలు గుర్తుండవు కానీ నాగార్జున్ మాత్రం అలా కాదు.. వారి తండ్రి కోరికను ఇలా నెరవేరుస్తూ వస్తున్నారు. ఏఎన్నార్ లాంటి మహనీయ వ్యక్తి మరొకరుండరు.. ఆయన నా కలలోకి వస్తుంటారు. ఈ కార్యక్రమం ఆదివారం (నవంబర్ 17) నాడు అంగరంగ వైభవంగా జరగబోతోంది. శ్రీదేవీ, రేఖలకు ఈ అవార్డును ప్రధానం చేయనున్నాము. ఏఎన్నార్ నా కలలోకి వస్తూ ఉంటారు. బోనీకపూర్, జాన్వీ, ఖుషీ కపూర్‌లు తీసుకుంటారు' అని అన్నారు.

    English summary
    ANR National Awards For 2018 And 2019 Goes to Sridevi And Rekha. On Behalf of Sridevi, Boney Kapoor And Janvi Kappor And Kushi Kapoor Will Attend Event And Takes The Award. This Event On 17th November At Annapurna Studios. Chiranjeevi Is Chief Guest For The Event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X