For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంట్రెస్టింగ్: సీక్రెట్స్ బయటపెట్టేందుకు రెడీ అయిన అనుష్క..

  |

  2005 సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు తెరపై కాలుమోపిన స్వీటీ అనుష్క ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. వరుస అవకాశాలతో 14 ఏళ్లుగా సౌత్ సినిమా ఇండస్ట్రీని ఏలుతోంది. రోజుకో కొత్త హీరోయిన్ ఆరంగ్రేటం చేస్తున్న నేటి తరుణంలో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది అనుష్క. సొంత అభిమానం వర్గమనేది స్టార్ హీరోలకు మాత్రమే సొంతం కాదు.. హీరోయిన్స్‌కి కూడా మంచి ఫాలోయింగ్‌తో పాటు ప్రత్యేక అభిమాన వర్గాలు ఉంటాయని ప్రూవ్ చేసిందీ భామ. అయితే ఇదంతా కేవలం ఆమె అందం, తెరపై చూపిన అభినయంతో వచ్చిన క్రేజ్ మాత్రమే.

  ఆరంభంలోనే నాగార్జునతో రొమాన్స్

  ఆరంభంలోనే నాగార్జునతో రొమాన్స్

  కెరీర్ ఆరంభంలోనే నాగార్జునతో రొమాన్స్ చేసిన అనుష్క ఆ తర్వాత అందరు అగ్ర హీరోల సరసన నటించింది. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి తన టాలెంట్ బయటపెట్టింది. బాహుబలి సిరీస్‌తో ఏకంగా వరల్డ్ స్టార్‌గా మారింది. కాగా ఆ మధ్యలో వచ్చిన సైజ్ జీరో సినిమా కోసం దాదాపు 20 కేజీల బరువు పెరిగి బొద్దుగా కనిపించి ఆశ్చర్య పర్చింది అనుష్క. క్యారెక్టర్ కోసం ఇంతలా బరువు పెరిగిన అనుష్క ఇక తగ్గటం కష్టమే అని భావించారంతా. కానీ క్రమంగా బరువు తగ్గి కుర్ర హీరోయిన్లు అసూయ పడే అందాన్ని తిరిగి సంపాదించుకుంది. నాజూకు నడుముతో ఈ మధ్యకాలంలో అనుష్క దిగిన పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

  అనుష్క ఫిట్‌నెస్ సీక్రెట్

  అనుష్క ఫిట్‌నెస్ సీక్రెట్

  దీంతో అనుష్క ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటా ? అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి. కానీ ఎవ్వరికీ అంతుచిక్కలేదు. చివరకు తానే ఆ సీక్రెట్ చెప్పడానికి రెడీ అయింది స్వీటీ అనుష్క. ‘ది మాజిక్ వెయిట్ లాస్ పిల్' అనే పుస్తకంలో తన ఫిట్‌నెస్ సీక్రెట్స్ ప్రచురించనుందట అనుష్క. ల్యూక్ కుతిన్హో రచనలో రాబోతున్న ఈ పుస్తకంలో 62 రకాల హెల్త్ టిప్స్, వెయిట్ లాస్ టెక్నిక్స్ ఉంటాయట.

  బాహుబలి, భాగమతి తర్వాత ప్రభాస్‌తో

  బాహుబలి, భాగమతి తర్వాత ప్రభాస్‌తో

  బాహుబలి, భాగమతి సినిమాల తర్వాత కొంతకాలం అనుష్క వెండితెరకు దూరంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఆమెకు పెళ్లి సంబంధాలు చూశారని, ప్రభాస్ తో పెళ్ళికి సిద్ధమైందని రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ చివరకు ఆమె బరువు తగ్గేందుకు ఈ గ్యాప్ తీసుకుందని కన్ఫర్మ్ అయింది.

  అనుష్క శెట్టి సినిమాల సంగతి

  అనుష్క శెట్టి సినిమాల సంగతి

  ఇక అనుష్క సినిమాల విషయానికొస్తే.. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైలెన్స్ అనే డిఫెరెంట్ మూవీలో లీడ్ రోల్ పోషిస్తోంది. అలాగే 13 ఏళ్ల తర్వాత చిరంజీవి సరసన సైరా నరసింహా రెడ్డి సినిమాలోని ఓ పాటలో చిందులేస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో కూడా అనుష్క దర్శనమీయనుంది.

  Read more about: anushka chiranjeevi book
  English summary
  Anushka is getting ready to reveal her weight loss secrets in a book. The book titled 'The Magic Weight Loss Pill' with Anushka and it will soon be published.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X