twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంక్రాంతి సినిమాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ విషయంలో భారీ ఊరట!

    |

    ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాక దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం నైట్ కర్ఫ్యూ విధించాలని అలాగే థియేటర్లో సహా మరికొన్ని ప్రదేశాల్లో కొన్ని ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకుంది. అయితే సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే సినిమాల విషయంలో మాత్రం కాస్త శుభవార్త చెప్పినట్లే చెప్పాలి. ఆ వివరాల్లోకి వెళితే

    టికెట్ రేట్లు వ్యవహారం

    టికెట్ రేట్లు వ్యవహారం

    ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు వ్యవహారం హాట్ టాపిక్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు భారీగా తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సినిమా టికెట్ రేట్లు పెంచాలని సినీ పరిశ్రమ మొదలు, సినిమా థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కోరుతున్నారు.. అయినా సరే ప్రభుత్వం మాత్రం పేదవాడికి వినోదం కూడా తక్కువ ధరలో దొరకాలి అని చెబుతూ ఈ టికెట్ రేట్లు పెంచే విషయంలో మొండి పట్టుదల చూపిస్తోంది.

    నైట్ కర్ఫ్యూ

    నైట్ కర్ఫ్యూ

    ఇప్పటికే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని అంటూ పలువురు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే దియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే నడపాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాల మీద కూడా కొన్ని ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అని కూడా ఆదేశాలు జారీ చేశారు.

    సినిమా వాళ్లకు ఊరటనిస్తూ

    సినిమా వాళ్లకు ఊరటనిస్తూ

    ముందు విడుదల చేసిన ఆదేశాల ప్రకారం సోమవారం రాత్రి 11 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ అమలు కావాల్సి ఉంది. అయితే నైట్ కర్ఫ్యూ కనుక అమలు జరిగితే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే నాలుగు షోలు ప్రదర్శితం అవుతున్న సినిమా మూడు షోలు గా మాత్రమే ప్రదర్శన కావాల్సి ఉంటుంది. అలాగే 50 శాతం ఆక్యుపెన్సీ తో మూడు షోలతో థియేటర్లు నడవడం అంటే సినిమాలు విడుదల చేయడం కూడా అనవసరం అని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా వాళ్లకు ఊరటనిస్తూ నిర్ణయం తీసుకుంది.

    నాగార్జునను దృష్టిలో పెట్టుకుని

    నాగార్జునను దృష్టిలో పెట్టుకుని

    అదేమిటి అంటే పండుగ పూర్తయ్యేవరకు ఆంధ్రప్రదేశ్ ల ప్రస్తుతానికి ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. అంటే పండగ పూర్తయ్యేవరకు థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ కాకుండా 100% ఆక్యుపెన్సీతో సినిమాలు నడుపుకోవచ్చు అలాగే నైట్ కర్ఫ్యూ కూడా అమలులో ఉండదు కాబట్టి నాలుగో షో కూడా వేసుకునే అవకాశం లభించినట్లయింది. అయితే నాగార్జునను దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల బంగార్రాజు ఈవెంట్ లో తనకు ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని ఆయన పేర్కొన్నారు.

    మిగతా సినిమాలు కూడా

    మిగతా సినిమాలు కూడా

    అయితే ఇటీవల ఈ 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన తీసుకువచ్చారు అని నాగార్జునకు కూడా ఇబ్బంది అంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ బంగార్రాజు సినిమా దర్శకుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రి కురసాల కన్నబాబు స్వయానా సోదరుడు కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపి ఈ మేరకు నిర్ణయాలు తీసుకునేలా చేశారని అంటున్నారు. ఏదైతేనేం నాగార్జున సినిమా మాత్రమే కాకుండా మిగతా సినిమాలు కూడా ఈ నిర్ణయంతో కాస్త ఊరట పొందినట్లు అయింది.

    English summary
    AP Government favours sankranthi movies by delaying its decision. ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సినిమాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ తన నిర్ణయాన్ని ఆలస్యం చేస్తోంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X