ఏపీలో సినీ ప్రేక్షకులకు శుభవార్త.. సీఎం జగన్, మంత్రి పేర్ని నానిపై ప్రశంసల వర్షం
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా ప్రదర్శన విషయంలో సంచలన నిర్ణయం తీసుకొన్నది. థియేటర్లలో 100 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమాలను ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. గతంలో అంటే జూలై 8వ తేదీన 50 శాతం అనుమతితో సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో 100 శాతం కెపాసిటీకి అనుమతించింది. దాంతో దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 14వ తేదీ నుంచి 100 శాతం కెపాసిటీతో థియేటర్లు నడువనున్నాయి. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై సినిమా నిర్మాతలు, దర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ధన్యవాదాలు తెలియజేసింది. 100 శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకొన్న ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి, మంత్రి పేర్ని నాని గారికి హృదయపూర్వకంగా థ్యాంక్స్. సినీ పరిశ్రమకు సపోర్టుగా నిలుస్తూ నిర్ణయం తీసుకొన్నందుకు ఆనందంగా ఉంది. సినీ పరిశ్రమ మళ్లీ కోలుకోవడానికి ఇది కీలక నిర్ణయం అంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది.
ఏపీలోని థియేటర్లలో నాలుగు షోలతోపాటు 100 శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతి ఇస్తూ తీసుకొన్న నిర్ణయానికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి, మంత్రి పేర్ని నాని గారికి హృదయపూర్వకంగా థ్యాంక్స్. సినీ పరిశ్రమ అభివృద్దికి ఈ నిర్ణయం మేలు చేస్తుంది అని మైత్రీ మూవీ మేకర్స్ అన్నారు.
ఏపీలో థియేటర్లలో పూర్తిస్తాయిలో కెపాసిటీకి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకొన్న ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి జగన్, మంత్రి పేర్ని నానికి హృదయపూర్వక ధన్యవాదలు. మీరు తీసుకొన్న నిర్ణయం సినిమా పరిశ్రమ అభివృద్దికి దోహదపడుతుంది. మా సినిమా పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశ కల్పించింది అని షైన్ ష్క్రీన్స్ బ్యానర్ ట్వీట్‌లో వెల్లడించింది.


Click it and Unblock the Notifications











