twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వానికి షాక్.. నిర్మాత నట్టికుమార్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ఆదేశం

    |

    ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల అమ్మకాల వివాదం అగ్గిని రాజేస్తున్నది. ఏపీలో అధికారులు నిర్లక్ష్యం అనేక విమర్శలకు లోనవుతున్నది. తెలుగు సినిమా పరిశ్రమలో కేవలం అగ్ర నిర్మాతలే కాకుండా చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతలు పలు అంశాలను లేవనెత్తుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35 అమలు కావడం లేదంటూ చిన్న సినిమా నిర్మాతల సంఘం అధ్యక్షుడు నట్టికుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే..

    సినిమా టికెట్ రేట్లు పెంచకుండా

    సినిమా టికెట్ రేట్లు పెంచకుండా

    ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35 విషయానికి వస్తే.. సినిమా టికెట్ రేట్ల నియంత్రణ కొనసాగేలా చర్యలు తీసుకొన్నది. గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ రేట్‌ను ప్రభుత్వbo నిర్ణయించి చిన్న సినిమా నిర్మాతల ప్రయోజనాలు కాపాడే విధంగా ఓ జీవోను జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని సింగిల్ థియేటర్లలో 100 మించకుండా కట్టడి చేసింది. అయితే ఆ జీవో అమలు సరిగా లేదంటూ ఇటీవల నట్టి కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.

    జీవో 35ను అమలు చేయాలంటూ..

    జీవో 35ను అమలు చేయాలంటూ..


    ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్ల టికెట్ల రేట్లను నిర్ణయిస్తూ తీసుకుని వచ్చిన జీవో 35 అమలు అంశంపై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జి‌బిటర్ నట్టి కుమార్ వేసిన పిటిషన్‌కు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. జీవో 35ను అధికారులు అమలుపరచాలంటూ ఏపీలోని అమరావతి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వానికి చురకలు అంటించినట్టు అయింది.

    బహిరంగ మార్కెట్‌లో ఇష్టారాజ్యంగా

    బహిరంగ మార్కెట్‌లో ఇష్టారాజ్యంగా


    విశాఖపట్నం జిల్లాలోని కొంతమంది థియేటర్ల యజమాన్యాలు 35 జీవో‌ను అమలుపరచకుండా... తమ ఇష్టానుసారం అధిక రేట్లకు బహిరంగంగా బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మడంపై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుల సొమ్ము దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కాబట్టి .తక్షణమే ఈ అన్యాయం, దోపిడీపై చర్యలు తీసుకోవాలి అని నట్టికుమార్ ఏపీలోని అమరావతి హైకోర్టుకెక్కిన విషయం తెలిసిందే.

    35 రూపాయల టికెట్ 100 రూపాయలకు

    35 రూపాయల టికెట్ 100 రూపాయలకు


    ఏపీలో 35 రూపాయల టిక్కెట్లను కొంతమంది థియేటర్స్ యాజమాన్యాలు 100 రూపాయలకు బహిరంగంగా అమ్ముతున్నారు. ఈ బ్లాక్ మార్కెట్‌పై చర్యలు తీసుకోవాలి. స్థానిక ఎమ్మార్వో, ఆర్డీవో స్థాయి అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. అందుకే తాను కోర్టును ఆశ్రయించాను అంటూ నట్టికుమార్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బ్లాక్ మార్కెట్ కారణంగా కోట్లాది రూపాయల ప్రభుత్వం ఆదాయానికి గండిపడుతోంది అని నట్టి కుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

    చిన్న సినిమాలకు మేలు జరుగుతుందని..

    చిన్న సినిమాలకు మేలు జరుగుతుందని..


    టికెట్ల అమ్మకాల విషయంపై తాను కోర్టును ఆశ్రయించండంతో వాదనలు జరిగాయి. ఆ మేరకు సోమవారం హైకోర్టు జీవో 35 ని అమలు పరచాలంటూ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్, అనకాపల్లి ఆర్డీవోకి మధ్యంతర ఆదేశాలు జారీ చేసిందని నట్టికుమార్ మీడియాకు తెలిపారు. దీంతో చిన్న నిర్మాతలకు, చిన్న సినిమాలకు మేలు జరుగుతుందిని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    Recommended Video

    Mahesh Babu Is The Brand Ambassador For Big C
    అనకాపల్లి ఆర్డీవో‌పై చర్యలు తీసుకోవాలి

    అనకాపల్లి ఆర్డీవో‌పై చర్యలు తీసుకోవాలి

    హైకోర్టులో తాను వేసిన పిటిషన్‌పై అనకాపల్లి ఆర్డీవో కౌంటర్ వేయకుండా వేయలేదు. జీవో 35ను అమలు పరచకుండా కొంతమంది థియేటర్ యజమాన్యాలు, ఒక బడా నిర్మాత, ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్ ఒక వ్యక్తితో కుమ్మక్కయారు. ఆ విషయంలో తన ఫిర్యాదును పట్టించుకోలేదు. చివరికి కోర్టులోనిజాయితినే గెలిచింది అని నట్టికుమార్ వెల్లడించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో సదరు ఆర్డీవో‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నట్టికుమార్ విజ్ఞప్తి చేశారు.

    English summary
    AP High Court gives interim order on GO 35 Which issued by Andhra Pradesh Government. Producer Natti Kumar's filed a petition to protect ticket rate hike.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X