Don't Miss!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రాహుల్ సిప్లిగంజ్ తో ఊహించని విధంగా అషురెడ్డి.. నాటు అంటూ అలా పట్టుకుని!
సోషల్ మీడియా వాడకం పెరిగాక అనేక మంది సెలబ్రిటీలు పుట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాను యంగ్ జనరేషన్ నుంచి ఓల్డ్ జనరేషన్ వరకు అందరూ ఉపయోగిస్తున్నారు. కొంతమంది కమ్యూనికేట్ చేసుకోవడానికి వాడితో.. మరికొందరూ సమాచారం కోసం వినియోగిస్తున్నారు. ఇంకొందరైతే తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకునేందుకు ఒక మంచి ప్లాట్ ఫామ్ గా వాడుకుంటున్నారు. అలా వాడుకుంటూ హాట్ అందాలను ఆరబోస్తూ సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు. అలాంటి వారిలో ఒకరే అషు రెడ్డి. సోషల్ మీడియా ద్వారానే పాపులర్ అయిన ఈ బ్యూటి తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తో ఊహించని విధంగా దర్శనమిచ్చింది.

ఇంటర్నెట్ ద్వారా..
సోషల్ మీడియా వాడకం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఎవరికైనా అందుబాటులో ఉండి తమ విషయాలను షేర్ చేసుకోవాలంటే సామాజిక మాద్యమం ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇక అప్ కమింగ్ హీరోలకు, హీరోయిన్లకు తమ టాలెంట్ చూపించుకోడానికి ఇది ఒక మంచి వేదికగా పనికొస్తుంది. ఇలా.. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇలా ఇంటర్నెట్ ద్వారా ఎక్కువ గుర్తింపు సాధించిన తెలుగు అమ్మాయిల్లో అషు రెడ్డి ఒకరు.

సమంతలా ఉండటంతో..
ఇన్ స్టా గ్రామ్, టిక్ టాక్ లేని సమయంలో ఎక్కువగా పాపులర్ అయినవి డబ్‌స్మాష్ వీడియోలు. ఈ డబ్ స్మాష్ ల ద్వారా వెలుగులోకి వచ్చిన అచ్చమైన తెలుగు అందమే అషు రెడ్డి. డబ్ స్మాష్ ల ద్వారా ఫేమ్ అయిన అషు రెడ్డి చూడటానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండి యాక్టివ్ గా డబ్‌స్మాష్ వీడియోస్ చేసేసరికి నెటిజన్లు ఫుల్ ఫిదా అయిపోయారు. దీంతో ఒక్కసారిగా ఆమెను పాపులర్ చేసేశారు.

వరుసగా ఆఫర్లు రావడంతో..
అప్పటి నుంచి ఇప్పటి వరకు అషు రెడ్డిని బుల్లితెర సమంత, జూనియర్ సమంత అని కూడా పిలుస్తారు. అషు రెడ్డి ఇలా అచ్చం సమంతలా కనిపించడం, చలాకీగా మాట్లాడటంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పుడప్పుడు అషు రెడ్డి కూడా సమంతను ఇమిటే చేస్తూ డ్రెస్సులు వేస్తుంటుంది. దీంతో అషు రెడ్డికి వరుసగా ఆఫర్లు రావడం స్టార్ట్ అయింది. ఇందులో భాగంగానే యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్ హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఛల్ మోహనరంగ చిత్రంలో ఓ పాత్రలో కనువిందుచేసింది అషు రెడ్డి.

బోల్డ్ నెస్ కు ఫిదా..
నితిన్ ఛల్ మోహన్ రంగ సినిమాలో ఆడిపాడిన అషు రెడ్డి కొద్దిరోజులకు అత్యధికంగా పాపులర్ అయిన తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొంది. బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ లోకి అడుగుపెట్టిన అచ్చ తెలుగు అందం అషు రెడ్డి గేమ్ పరంగా అంతగా ప్రభావం చూపించలేదు. కానీ హౌజ్ లో అషు రెడ్డి బోల్డ్ నెస్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాగే తన ఫ్రెండ్ అయిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో మంచి ర్యాపో ఉండటంతో ఫేమస్ అయింది.

ఫోకస్ సినిమాలో..
బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో చెట్టాపట్టాలు వేసుకుని గడపడం, బోల్డ్ డ్రెస్సులతో సూపర్ పాపులర్ అయింది ముద్దుగుమ్మ అషు రెడ్డి. ఈ సీజన్ తర్వాత కూడా మరోసారి మళ్లీ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ లో పాల్గొంది. అందులోను హాట్ గా రచ్చ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడు రచ్చ చేసే అషు రెడ్డి ఇటీవల ఫోకస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ గా నటించి ఆకట్టుకుంది ఈ భామ.
నాటు సక్సెస్..
సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఎలాంటి హద్దు లేకుండా ప్రదర్శించే అషు రెడ్డి తాజాగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఊహించని విధంగా దర్శనమిచ్చింది. క్యాజువల్ టీ షర్ట్, నైట్ పాయింట్ వేసుకున్న అషురెడ్డి.. రాహుల్ ను హగ్ చేసుకుని, చెంపలు పట్టుకుని ముద్దు చేస్తూ కనిపించింది. ఈ ఫొటోలు షేర్ చేసిన అషు రెడ్డి 'నాటు సక్సెస్' అని రాసుకొచ్చింది. మరి కొన్ని పిక్స్ చేసిన అషురెడ్డి అందులో బ్లూ కలర్ డ్రెస్సులో థైస్ తో పాటు ఎద అందాలను బాహటంగా ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. RRR కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంగా చేసుకున్న సెలబ్రేషన్స్ లో అషు రెడ్డి పాల్గొన్నట్లు తెలుస్తోంది.