twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌ను వెంటాడుతున్న వరుస విషాదాలు.. సీనియర్లను కబళిస్తున్న అనారోగ్యం

    |

    టాలీవుడ్ లో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.. ఈ ఏడాది కాలంలో చాలా మంది టాలీవుడ్ వ్యక్తులు దూరమయ్యారు. ఒకరకంగా వారి మరణం టాలీవుడ్ కి తీరని లోటు అని చెప్పాలి. రోజుల వ్యవధిలోనే శివ శంకర్ మాస్టర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి దూరమయ్యారు. ఇక ఈ ఏడాది టాలీవుడ్ కు దూరమైన వారి వివరాల్లోకి వెళితే

    శివశంకర్ మాస్టర్

    శివశంకర్ మాస్టర్

    శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితమే కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించిచడంతో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఊపిరితిత్తులకు 75శాతం ఇన్ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందించారు. అయినా మాస్టర్ కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

    పీఆర్వో బీఏ రాజు

    పీఆర్వో బీఏ రాజు

    ప్రముఖ నిర్మాత, సినీ పీఆర్వో బీఏ రాజు 62 సంవత్సరాల వయసులో మే 22న కన్నుమూశారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలో నివసిస్తున్న ఆయనకు అర్ధరాత్రి సమయంలో గుండెపోటు రావడంతో దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో అప్పటికప్పుడే తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య కూడా ఇదే విధంగా గుండెపోటుకు గురై మరణించడం బాధాకరం.

    టీఎన్‌ఆర్‌

    టీఎన్‌ఆర్‌

    ప్రముఖ జర్నలిస్ట్‌, యాంకర్‌, నటుడు టీఎన్‌ఆర్‌ అలియాస్ తుమ్మల నరసింహా రెడ్డి ఈ ఏడాది మే 10న కన్నుమూశారు. తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ ఎంతో పాపులర్‌ అయిన టీఎన్‌ఆర్‌ కరోనా రక్కసి కోరలకు చిక్కి బలయ్యారు. కొద్ది రోజులు కరోనాతో పోరాడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందిన ఆయన కన్నుమూయడం కూడా టాలీవుడ్ కు తీరని లోటు. ఆయన కుటుంబానికి టాలీవుడ్ నుంచి చాలామంది అండగా నిలిచారు.

    నర్సింగ్ యాదవ్

    నర్సింగ్ యాదవ్


    ఇక సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ కూడా గత ఏడాది 31 డిసెంబర్ న కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లో చేరిన నర్సింగ్ యాదవ్.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చనిపోవడానికి ముందు నర్సింగ్ యాదవ్ ఏడాది కాలం కిడ్నీ సమస్యతో బాధపడ్డారు. చాలా రోజులు కోమాలోనే ఉన్న ఆయన ఎట్టకేలకు కన్ను మూశారు. ఆయన కుటుంబానికి టాలీవుడ్ నుంచి చాలామంది అండగా నిలిచారు.

    Recommended Video

    Choreographer Shiva Shankar Master శివైక్యం... ప్రముఖుల సంతాపం!! || Filmibeat Telugu
     సిరివెన్నెల సీతారామశాస్త్రి

    సిరివెన్నెల సీతారామశాస్త్రి

    ఇక తాజాగా ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో జాయినయ్యారు. డాక్టర్లు ఆయన ప్రాణాలు కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. సీతారామశాస్త్రి గొంతు మూగపోయింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడంతో ఆయనకు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    back to back tragic deaths of Tollywood personalities due to ill ness.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X