twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ 'నర్తనశాల'టికెట్ రేట్ ఫిక్స్.. సౌందర్య కోసమైనా అంత పెట్టాల్సిందే!

    |

    అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు వంటి వారు నటించిన బాలకృష్ణ నర్తనశాల ప్రేక్షకుల ముందుకి రాబోతున్న విషయం తెలిసిందే. 16 ఏళ్ల క్రితం అనుకోకుండా ఆగిపోయిన ఈ సినిమా తాలూకు 17 నిమిషాల సీన్స్ ని డిజిటల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకి తీస్తున్న బాలకృష్ణ సినిమా చూడటానికి ఒక రేటును కూడా ఫిక్స్ చేశారు.

     ఎన్టీఆర్ నర్తనశాల ఆధారంగానే..

    ఎన్టీఆర్ నర్తనశాల ఆధారంగానే..

    బాలకృష్ణ 16ఏళ్ల క్రితం నర్తనశాల అనే సినిమాను తన దర్శకత్వంలో తెరకెక్కించాలని అనుకున్నాడు. సినిమాను చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. 1963లో సీనియర్ ఎన్టీఆర్ నటించిన నర్తనశాల ఆధారంగానే ఆ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే సడన్ గా సినిమాకు అనుకోని సమస్యలు వచ్చి పడడంతో ఆపేశారు. అదే సమయంలో సౌందర్య కూడా మరణించింది.

    బాలయ్య ఎందుకో ధైర్యం చేయలేదు

    బాలయ్య ఎందుకో ధైర్యం చేయలేదు

    ముందే ఈ ప్రాజెక్ట్ కు కొన్ని ఆర్థిక కారణాలు కూడా ఇబ్బందులు పెడుతున్న సమయంలో హీరోయిన్ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. ద్రౌపతి పాత్ర చేయడానికి ఒప్పుకున్న సౌందర్య చనిపోవడంతో 2004లో ఆ సినిమా అలానే ఆగిపోయింది. అయితే ఆ సినిమాను మళ్ళీ తెరకెక్కించడానికి బాలయ్య ఎందుకో ధైర్యం చేయలేదు.

    టికెట్ ధర 50రూపాయలు

    టికెట్ ధర 50రూపాయలు

    ఇక షూట్ చేసిన 17 నిమిషాల ప్రింట్ ని అలానే దాచుకున్న బాలకృష్ణ మళ్ళీ ఆ ప్రింట్ ని డిజిటల్ రూపంలోకి కన్వర్ట్ చేశారు. అంతే కాకుండా ఇప్పుడు శ్రేయస్ etలోని ఎన్‌టిఆర్ థియేటర్‌లో దసరా కానుకగా 24న ప్రదర్శించబడుతుందని తెలిపారు. ఇక ఈ షార్ట్ మూవీని చేసేందుకు ఒక వ్యూవ్ కి 50 రూపాయల ధరను నిర్ణయించారు. ముందే టికెట్ బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు.

    సౌందర్య కోసమైనా చూడాల్సిందే..

    సౌందర్య కోసమైనా చూడాల్సిందే..

    ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తం డబ్బును చారిటీస్ కి ఉపయోగించడానికి నిర్ణయించుకున్నారు. నిజానికి బాలకృష్ణ పెట్టిన ధర న్యాయమైందనే చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు 100, 200 రూపాయలు అంటూ అడల్ట్ సినిమాలతో భారీగా టికెట్స్ రేట్స్ ఫిక్స్ చేస్తున్న సమయంలో ఇలాంటి మంచి సినిమా కోసం బాలయ్య కేవలం 50 రూపాయలు మాత్రమే సెట్ చేశారు. ఇక చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను సౌందర్య కోసమైనా చూడాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు.

    English summary
    Balakrishna wanted to direct a film called Narthanashala 16 years ago under his direction. The movie started out very grand. The film was based on the dance floor in 1963, starring senior NTR. However, the film was abruptly stopped due to unforeseen problems
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X