Don't Miss!
- Sports
IND vs NZ:భారత్.. సిరీస్ గెలవాలంటే ఈ తప్పిదాలను సరిదిద్దుకోవాల్సిందే!
- News
Tarakaratna: నందమూరి అభిమానులకు ప్రముఖుల మనవి, ఏం జరుగుతోంది, ఎప్పటికప్పుడు రిపోర్టు!
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Balakrishna: రూటు మార్చిన వీర సింహా రెడ్డి.. అందులో వెనక్కి తగ్గి కొత్త స్కెచ్!
నందమూరి నటసింహం బాలయ్య బాబు ఈ ఏడాది ఫుల్ జోష్ లో ఉండనున్నాడు. ఎందుకంటే ఈ సంవత్సరం మొదటి నెలలోనే సంక్రాంతి కానుకగా తన సినిమాతో అభిమానులకు సూపర్ ట్రీట్ ఇవ్వనున్నాడు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరి సింహా రెడ్డి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా జనవరి 12న విడుదల కాగా ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు. అందులో భాగంగానే జనవరి 6న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దాంతో పాటు ఇప్పటికే టీజర్స్, సాంగ్స్ ఒక్కొక్కటిగా వదిలారు. అయితే ఇవాళ మాస్ మొగడు అనే పాటను రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్ వెనక్కి తగ్గారు. ఎందుకనే వివరాల్లోకి వెళితే..

మరోసారి తమన్ సంగీతంలో..
మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనే దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వీర సింహా రెడ్డి. ఇటీవల బాలకృష్ణ అఖండ సినిమాతో, గోపిచంద్ మలినేని క్రాక్ మూవీతో మంచి జోష్ మీదున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. బాలకృష్ణ అఖండ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ తో అభిమానుల చేత ఉర్రూతలూగించాడు. ఇప్పుడు వీర సింహా రెడ్డి సినిమాకు కూడా తమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

యూట్యూబ్ లో ట్రెండింగ్..
వీర సింహా రెడ్డి సినిమా నుంచి ఇదివరకు విడుదలైన టీజర్, పోస్టర్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు పాటలకు వచ్చిన క్రేజ్ మాములుగా లేదు. తొమ్మిది రోజుల క్రితం విడుదలైన మా బావ మనోభావాలు సాంగ్ కి అయితే ఇప్పటికే కోటి వ్యూస్ రాగా.. 1.5 లక్షల లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

ఇవాళ విడుదల చేస్తామని..
ఈ క్రమంలోనే మరో మాస్ నెంబర్ ను ఇవాళ విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించారు. బాలకృష్ణ, శ్రుతీ హాసన్ పై చిత్రీకరంచిన మాస్ మొగుడు అంటూ సాగే పాటను జనవరి 3 మంగళవారం రాత్రి 7 గంటల 55 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "మాస్ జాతరకు ఇంకాస్తా డోస్ పెంచుతూ ఈ న్యూ ఇయర్ ను ప్రారంభిద్దాం" అంటూ రాసుకొచ్చారు.

ట్రైలర్ ఎప్పుడా అని..
అయితే ఈ పాట విడుదల విషయంలో మేకర్స్ వెనక్కి తగ్గారు. మాస్ మొగుడు సాంగ్ కంటే ముందుగా అభిమానులకు సూపర్ ట్రీట్ ఇవ్వనున్నారు. "మాస్ మొగుడు పాటను తర్వాత రోజు విడుదల చేస్తాం. దానికంటే ముందుగా ట్రైలర్ విడుదల తేదిని, మాసీవ్ ఈవెంట్ ను ప్రకటిస్తాం" అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వీర సింహా రెడ్డి విడుదలకు ఇంకొన్ని రోజులే మిగిలి ఉంది. దీంతో ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది.

రిలీజ్ డేట్ ఎప్పుడు..
అయితే వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజునే ట్రైలర్ ను రిలీజ్ చేస్తారేమో అని ఫ్యాన్స్ భావించారు. కానీ ఇప్పుడు మాస్ మొగుడు పాటను వెనక్కి నెట్టి దానికంటే ముందుగా సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తామని గుడ్ న్యూస్ తెలిపారు మేకర్స్. అయితే ఈ ట్రైలర్ ను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు కానీ, తేది మాత్రం ప్రకటించలేదు. ఇప్పుడు మాస్ మొగుడు సాంగ్ రిలీజ్ చేస్తామన్న సమయానికే ట్రైలర్ విడుదల చేస్తారా.. లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజే రిలీజ్ చేస్తారా అనేది చర్చనీయాంశమైంది.
కొత్త స్కెచ్ వేయనున్నారా..
మాస్ మొగుడు పాటను వెనక్కి నెట్టి రూట్ మార్చిన వీర సింహా రెడ్డి మేకర్స్ మరి ఏం కొత్త స్కెచ్ వేయనున్నారో అని నెటిజన్స్, ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ డ్యుయల్ రోల్ చేస్తున్న వీర సింహా రెడ్డి చిత్రంలో కోలీవుడ్ స్టార్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ మరో కీలక పాత్రల్లో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాను టాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు.