twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Drugs Caseలో బండ్ల ఎంట్రీ, పూరీ కోసమే వచ్చా.. అదే కాపాడుతుందంటూ ఆసక్తికర ట్వీట్!

    |

    టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పూరి జగన్నాథ్ ఈరోజు ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరైన సంగతి తెలిసిందే. లెక్క ప్రకారం 10 గంటల 30 నిమిషాలకు ఈ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఒక అరగంట ముందే పూరి జగన్నాథ్ విచారణకు హాజరయ్యారు.. అయితే సుదీర్ఘంగా కొనసాగుతున్న పూరి జగన్నాథ్ విచారణ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పూరి జగన్నాథ్ విచారణ కొనసాగుతుండగానే ఈడి ఆఫీస్ దగ్గరకు బండ్ల గణేష్ రావడం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

    ఏడున్నర గంటల నుంచి

    ఏడున్నర గంటల నుంచి

    టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగిన సంగతి దాదాపు అందరికీ తెలిసిందే. ఈ కేసులో పూరి జగన్నాథ్ ఈ రోజు విచారణకు హాజరు కాగా సుదీర్ఘంగా అంటే సుమారు ఏడున్నర గంటల నుంచి ఈ విచారణ కొనసాగుతోంది. 2015వ సంవత్సరం నుంచి పూరి జగన్నాథ్ కి సంబంధించిన అన్ని బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. పూరి జగన్నాథ్ బ్యాంక్ అకౌంట్ నుంచి విదేశీ లావాదేవీలు భారీగా ఉన్న నేపథ్యంలో ప్రతి లావాదేవీ గురించి కూలంకషంగా వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    చార్టెడ్ అకౌంటెంట్ సాయంతోనే

    చార్టెడ్ అకౌంటెంట్ సాయంతోనే

    అయితే పూరి జగన్నాథ్ స్వయంగా సమాధానాలు చెప్పకుండా తన చార్టెడ్ అకౌంటెంట్ సాయంతో ఈడీ అధికారులకు సమాధానాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ అభిషేక గోయల్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది.. ఈ విదేశీ లావాదేవీల గురించి పూరి జగన్నాధ్ ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే పూరి జగన్నాథ్ చార్టెడ్ అకౌంటెంట్ ఇస్తున్న స్టేట్ మెంట్ తో పాటు ఈడీ అధికారులు తమ వద్ద ఉన్న సమాచారం తో సరి పోల్చుకుని విచారణ జరుపుతున్నారు అని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ కి ఉన్న దాదాపు మూడు అకౌంట్ ల నుంచి విదేశీ ఖాతాలకు భారీగా నిధులు మళ్లించారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఛార్మితో ఉన్న ఒక జాయింట్ అకౌంట్ నుంచి కూడా డబ్బులు వెళ్లాయని అంటున్నారు.

    బండ్ల రాకతో అనేక అనుమానాలు

    బండ్ల రాకతో అనేక అనుమానాలు

    విదేశీ అకౌంట్లకు డబ్బులు వెళ్లిన మాట వాస్తవమే గానీ వాటికి డ్రగ్స్ కొనుగోళ్లకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగుతోందని అంటున్నారు. అయితే సుదీర్ఘ విచారణ నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశం అవుతోంది. అయితే కొద్ది సేపటి క్రితం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసుకు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ చేరుకోవడం కూడా చర్చనీయాంశం అయింది. ఆయనకు ఏమైనా నోటీసులు వచ్చాయా ? అనే కోణంలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తాను పూరి జగన్నాథ్ కోసమే వచ్చానని, అసలు తనకు ఎందుకు నోటీసులు వస్తాయని ఎదురు ప్రశ్నించారు. ఆయన అలా చెప్పడంతో దీనిమీద మరిన్ని అనుమానాలు వ్యక్తం అయ్యే పరిస్థితి ఏర్పడింది.

    ధర్మాన్ని ఆచరించండి ధర్మమే కాపాడుతోంది

    ధర్మాన్ని ఆచరించండి ధర్మమే కాపాడుతోంది

    ఎందుకంటే పూరి జగన్నాథ్ ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్నారు. విచారణ ఎదుర్కొంటున్న సమయంలో ఆయనను ఎవరు కలిసే అవకాశం ఉండదు.. అలాంటిది తన పూరి జగన్నాథ్ కోసం వచ్చానని బండ్ల గణేష్ చెప్పడంతో అసలు ఏం జరుగుతోంది అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ విషయం మీద కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ వేదికగా బండ్లగణేష్ స్పందిస్తూ "దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాకు ఏ విధమైన సంబంధం లేదు నేను పూరి గారికి మద్దతుగా మాత్రమే వచ్చా" అని పేర్కొన్నాడు. అంతేకాక ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అంటూ కామెంట్ చేశాడు.

    Recommended Video

    Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
    అందరూ అక్కడే

    అందరూ అక్కడే


    ఇక ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు పూరి జగన్నాథ్, పూరి జగన్నాథ్ చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే విచారణలో ఉన్నారు. ఉదయాన్నే పూరి జగన్నాథ్ తో కలిసి ఆయన తనయుడు ఆకాష్ పూరి కూడా విచారణకు రాగా ఆయన రిసెప్షన్ లోనే ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయన తనకు తోడుగా పూరి జగన్నాథ్ డ్రైవర్, పూరి జగన్నాథ్ పీఆర్వో కూడా అక్కడికి చేరుకున్నారు.. వీళ్లకు తోడుగా పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ కూడా అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే పూరి జగన్నాథ్ కి అండగా నిలబడేందుకు మద్దతు ఇచ్చేందుకు వచ్చాను అని బండ్లగణేష్ చెబుతున్నారు కాబట్టి ఆయన కూడా రిసెప్షన్ లోని ఎదురు చూస్తూ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వెలువడే అవకాశం కనిపిస్తోంది.

    English summary
    as we all know Puri Jagannadh attended to enforcement directorate interrogation in Tollywood drugs case.. now bandla Ganesh came to office to support Puri Jagannath in this case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X