Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bandla Ganesh : జనసేనలో అందుకే చేరలేదు.. మా కులం అది.. నేనెవరి బినామీని అంటే?
సినిమా రంగంలో ఒక ప్రొడక్షన్ మేనేజర్ గా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ ఆ తర్వాత కాలంలో నటుడిగా మారారు.. కొంత కాలం పాటు వరుసగా సినిమాల్లో నటుడిగా రాణించినా ఆ తర్వాత నిర్మాతగా మారి స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు.. అయితే ఆయన ఎక్కువగా పవన్ కళ్యాణ్ భక్తుడిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. అయితే అలాంటి ఆయన జనసేనలో చేరకుండా కాంగ్రెస్ లో చేరడం మీద చాలా చర్చోపచర్చలు జరిగాయి.. తాజాగా ఈ విషయం మీద ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే

గొంతు కోసుకుంటానని
బండ్ల గణేష్ అనే పేరు వింటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పేరు కూడా వెంటనే గుర్తు వస్తుంది.. అంతలా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో తన బంధం పెనవేసుకుపోయింది అనే ఉద్దేశాన్ని జనాల్లోకి తీసుకు వెళ్లగలిగారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ స్థాపించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అప్పట్లో హల్చల్ చేసినా సరే బండ్ల గణేష్ మాత్రం జనసేన పార్టీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.. కాంగ్రెస్ నుంచి బండ్ల గణేష్ పోటీ చేస్తారని భావించినా చివరి నిమిషంలో ఆయనకు టికెట్ దక్కలేదు. అయినా సరే కాంగ్రెస్ తరపున ఆయన ప్రచారం చేసి ఓడిపోతే గొంతు కూడా కోసుకుంటానని ఆయన చాలెంజ్ విసిరారు.

అందుకే చేర లేదు
తాజాగా ఈ విషయం మీద ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన కీలక వివరాలు వెల్లడించారు..పవన్ పార్టీలో ఎందుకు చేరలేదు ? మీరు దేవుడిగా భావించే పవన్ పార్టీ పెడితే మీలాంటి వాళ్ళు తప్పుకోవడం కరెక్ట్ ఏనా అని ప్రశ్నించగా తాను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానిని అని కాంగ్రెస్ పార్టీలోనే తనకు ఆసక్తి ఉందని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.
తనకు పవన్ అంటే చాలా అభిమానం అని అభిమానం అనే కంటే కూడా ఒక రకమైన కృతజ్ఞతాభావం అని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీని తనకు తల్లితండ్రి లాంటిదని పవన్ కళ్యాణ్ కోసం ఆ పార్టీని వదిలి పవన్ పార్టీలో చేరడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

శపధం
ఇక కాంగ్రెస్ పార్టీ గెలుపు కచ్చితంగా ఉంటుందని మీరు శపధం చేశారు కదా మరి ఆ విషయం మీద ఏమీ మాట్లాడలేకపోయారు ఏమిటి అని ప్రశ్నించారు. అయితే ఒక సినిమా చేసినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ సినిమా గురించి ఒక రేంజ్ లో చెబుతామని అయితే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది సూపర్ హిట్ అవుతుందో లేక డిజాస్టర్ గా నిలవనుందో ముందే డిజాస్టర్ గా నిలుస్తుందని ఎవరు చెప్పారు కదా అన్నారు. ఇది కూడా ఒక రకమైన పబ్లిసిటీ అని తాను కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి శాయశక్తులా కృషి చేశాను అని దురదృష్టవశాత్తు పార్టీ గెలవలేదని అని చెప్పుకొచ్చారు.. ఇక తాను ఎప్పటికీ పవన్ కళ్యాణ్ భక్తుడిగా ఉంటానని పేర్కొన్న బండ్ల గణేష్ అది ఒక రకమైన కృతజ్ఞతాభావం అని కూడా చెప్పారు.

బినామీగా ముద్ర
ఇక బొత్స సత్యనారాయణ బినామీ అనే ఆరోపణల మీద కూడా బండ్ల గణేష్ స్పందించారు. బొత్స సత్యనారాయణ తనకు ఎలాంటి బంధువు కాదు అని ఆయన వెల్లడించారు.. బొత్స సత్యనారాయణ ఒక మనిషిగా తనకు పరిచయం అని ఒక మంచి స్నేహితుడు లాంటి వాడు అని చెప్పుకొచ్చారు.. అయితే మా ఇద్దరి కులాలు కూడా వేరని ఆయన కాపులు అయితే నేము కమ్మ కులానికి చెందిన వ్యక్తిని అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. తమ పూర్వీకులు గుంటూరు జిల్లాకు చెందిన వారు కాగా బతుకుదెరువు కోసం ముందు కర్ణాటకలో రాయచూరు ప్రాంతానికి వెళ్లానని ఆ తర్వాత అక్కడి నుంచి తెలంగాణలో షాద్ నగర్ వచ్చి ఇక్కడ స్థిరపడిన అని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆయనతో కలిసి తిరుగుతూ ఉండేవాడిని కాబట్టే తనను ఆయన బినామీగా ముద్ర వేశారని చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్.

అందుకే మద్దతు
ఇక ప్రకాష్ రాజు కి మా ఎలక్షన్స్ లో మద్దతు ఇచ్చే వ్యవహారం గురించి కూడా ఆసక్తికరంగా స్పందించాడు. అది కేవలం రెండు సంవత్సరాల పదవి అని రెండు సంవత్సరాలు అతనికి అవకాశం ఇస్తే చేయగలరా లేదా అనే విషయం తెలిసి పోతుందని అన్నారు. తనకు వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్ మీద నమ్మకం ఉంది కాబట్టి అతనికి మద్దతుగా మాట్లాడారు అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఆయన అడిగితే తాను తన సొంత పొలం పది ఎకరాలు ఆయనకు అమ్మానని అక్కడే వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకుని ఆయన సమయం గడుపుతూ ఉంటారు అని చెప్పుకొచ్చాడు. కరోనా సమయంలో చుట్టుపక్కల గ్రామాలకు చేసిన సేవ తాను కళ్లారా చూశానని అలాంటి వ్యక్తి మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయితే సభ్యులందరికీ ఉపయోగం ఉంటుందని కూడా చెప్పుకొచ్చాడు. ఇక జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు తన సోషల్ మీడియాలో ఉండమని కోరడంతో ట్విట్టర్ కి బాయ్ చెప్పిన బండ్ల గణేష్ మళ్ళీ ట్విట్టర్ లో కొనసాగుతాను అని ప్రకటించిన సంగతి తెలిసిందే.