ఆమె చాలా ముదురు.. ఇండస్ట్రీలో అందర్నీ వెనుక తిప్పుకోన్నది.. బండ్ల గణేష్
తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం తెలుసు కదా. రొమాంటిక్, మ్యూజికల్ మూవీగా రూపొందిన ఈ సినిమాకు కృతి ప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ హీరోగా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ క్యాస్టూమ్ డిజైనర్ నీరజ కోన తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి డైరెక్టర్‌గా మారారు.
రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసి రూపొందించిన ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, హర్ష చెముడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జానశేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫి, నవీన్ నూలీ ఎడిటింగ్, ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. థమన్ అందించిన పాటలు ఇప్పటికే సంగీత ప్రియుల నుంచి మంచి ఆదరణ పొందాయి. ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీ 2025 సంవత్సరం రోజున రిలీజైంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ కొనసాగిస్తున్న సమయంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో థాంక్యూ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మాట్లాడుతూ..

సినిమా ప్రముఖులు, ఇండస్ట్రీ హృదయాన్ని, జీవితాన్ని ప్రజల వద్దకు చేరవేసే వారధి మీడియా. పోలీసుల మాదిరిగానే మీడియా సోదరులకు పండుగ, సెలవులనేవి ఉండవు. సినిమా ఫంక్షన్ పండుగు రోజు పెట్టినా వారు మా వద్దకు వచ్చి ఆ వార్తను కవర్ చేస్తారు. అలాంటి మీడియా ఒక్కసారి పెన్ డౌన్ చేస్తే వణుకు పుడుతుంది. అది వారి పవర్. తాము తీసిన సినిమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మీడియా వారధిలా పనిచేయాలి అని బండ్ల గణేష్ అన్నారు.
చిరంజీవికి స్వయంకృషి, వెంకటేష్‌కు బొబ్బిలిరాజా, నాగార్జునకు గీతాంజలి, శివ ఎలాగనో.. సిద్దూ జొన్నలగడ్డకు డీజే టిల్లు తర్వాత తెలుసు కదా సినిమా అలాంటిది. జోష్ సినిమాలో చిన్న వేషం కోసం పరితపించిన సిద్దూ.. డీజె టిల్లు లాంటి సినిమాలతో మాస్ హీరోగా మారాడు. ఇండస్ట్రీలో రవితేజకు అల్టర్నేటివ్ అవుతారు అని బండ్ల గణేష్ అన్నారు.
ఇక నీరజ కోన విషయానికి వస్తే.. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆమె నేను నిర్మించిన బాద్షా సినిమా ద్వారా స్టైలిష్ట్, క్యాస్టూమ్ డిజైనర్‌గా మారారు. తెలుగు రాష్ట్రాల్లో గొప్ప నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. అలాంటి వ్యక్తి సినిమా రంగంలోనా? అనే అనుమానం వచ్చింది. కోన వెంకట్ పరిచయం చేయగా మా సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆమె చాలా ముదురు.. బాద్షా సినిమా సమయంలో కొన్ని రోజుల్లోనే కాజల్‌తో చాలా క్లోజ్ అయింది. ఆ తర్వాత చాలా మంది హీరోయిన్లను తన వెంట తిప్పుకొన్నది అని బండ్ల గణేష్ అన్నారు.
నీరజ కోన స్టైలిష్ట్‌గానే కాకుండా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తెలుసు కదా సినిమాను చేయడం గర్వంగా ఉంది. డైరెక్టర్‌గా తొలి సినిమాలోనే మంచి రిజల్డ్ అంుదకోవడం గర్వగా ఉంది. ఆమె ప్యాషన్, టేస్ అద్డుతం. ఆమె గోల్డ్ స్పూన్‌తో పుట్టారు. అయినా చాలా ఒద్దికగా ఉంటూ అందర్నీ కలుపుకొంటూ పోతున్నారు. తెలుసు కదా సినిమా తీయడం మామూలు విషయం కాదు అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.
సిద్దూ జొన్నలగడ్డ గురించి మాట్లాడుతూ.. నువ్వు ఇండస్ట్రీని రూల్ చేస్తావు. డీజే టిల్లు సినిమాలో అద్బుతంగా నటించావు. తెలుసు కదా సినిా చూసిన నా భార్య కూడా సినిమా చాలా బాగుందని చెప్పారు. చివరగా విశ్వప్రసాద్ గురించి మాట్లాడుతూ.. అమెరికా నుంచి వచ్చి సినిమా తీయడానికి దమ్ముండాలి. కథను నమ్మి సినిమాలు తీస్తున్నారు. విశ్వగారు నిజంగా గ్రేట్. తోటి నిర్మాతగా నేను గర్వపడుతాను. నేను టెంపర్ లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చి బ్రేక్ తీసుకొన్నాను అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











