For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బంగార్రాజు మూవీ బడ్జెట్‌పై షాకింగ్ లీక్: అనుకున్నది అంతే.. ఖర్చు మాత్రం అన్ని కోట్లు

  |

  చాలా కాలంగా హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. అయినప్పటికీ ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. కానీ, సరైన రిజల్ట్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే నాలుగేళ్ల క్రితం సూపర్ డూపర్ హిట్ అయిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు ప్రీక్వెల్ చేయాలని ప్లాన్ చేశాడు. అలా అక్కినేని నాగార్జున 'బంగార్రాజు' అనే సినిమాను పట్టాలపైకి ఎక్కించేశాడు. ఇందులో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు.

  Janhvi Kapoor: బటన్స్ విప్పేసి రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ముందుకు వంగి మరీ అందాల జాతర

  'సోగ్గాడే చిన్ని నాయన' వచ్చిన తర్వాత 'బంగార్రాజు' ప్రాజెక్టు బాధ్యతను కల్యాణ్ కృష్ణకు అప్పగించాడు నాగార్జున. ఈ క్రమంలోనే ఇది అక్కినేని హీరోల మల్టీస్టారర్ మూవీగా వస్తుందన్న టాక్ కూడా వినిపించింది. కానీ, స్క్రిప్ట్ సరిగా లేకపోవడం వల్లో.. మరే ఇతర కారణాల వల్లో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే దీన్ని అధికారికంగా మొదలు పెట్టేశారు. రెగ్యూలర్ షూటింగ్ మొదలైన తర్వాత దీన్ని ఎంతో వేగంగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. దీన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నాగార్జున ప్రకటించారు. అందుకు అనుగుణంగానే షూట్‌ వేగంగా చేస్తున్నారు.

   Bangarraju Movie Budget Crossed Over Rs 40 Crore

  క్రేజీ కాంబినేషన్‌లో సోషియో ఫాంటసీ నేపథ్యంతో రాబోతున్న 'బంగార్రాజు' మూవీ షూటింగ్ జరుపుకుంటుండగానే ప్రమోషన్ కార్యక్రమాలను సైతం అప్పుడే ప్రారంభించేశారు. ఇప్పటికే కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితమే ఈ సినిమా నుంచి బంగార్రాజు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. తర్వాతి రోజే టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో ఊహించని విధంగా అక్కినేని నాగ చైతన్యను చూపించారు. తద్వారా ఇందులో బంగార్రాజు నాగార్జున కాదు.. నాగ చైతన్య అని వెల్లడించి ప్రేక్షకులకు షాకిచ్చారు.

  అరాచకమైన హాట్ ఫొటోను వదిలిన దిశా పటానీ: అబ్బో బికినీలో శృతి మించి.. ఇలా చూస్తే తట్టుకోగలరా!

  తాజాగా బంగార్రాజు మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదాని కంటే ఎక్కువ అయిందని తెలుస్తోంది. వాస్తవానికి దీన్ని రెమ్యూనరేషన్లతో కలిపి రూ. 30 కోట్ల లోపు చేయాలని అనుకున్నారట. కానీ, సినిమా పూర్తి కాకముందే ఖర్చు రూ. 40 కోట్లు దాటిపోయిందని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయినప్పటికీ దీన్ని నిర్మిస్తోన్న జీ సంస్థ వెనక్కి తగ్గడం లేదని సమాచారం. ఈ సినిమా కంటెంట్‌పై పూర్తి నమ్మకం ఉండడం వల్లే భారీగా ఖర్చు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

  'బంగార్రాజు' మూవీని అక్కినేని స్టూడియోస్ బ్యానర్ సమర్పణలో జీ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. నాగ చైతన్యకు జోడీగా 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే, ఇందులో దేవలోకంలో రంభ ఊర్వశి మేనకల పాత్రలు కూడా ఉంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని సంక్రాంతికి గానీ, జనవరి చివరి వారంలో కానీ విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  English summary
  Akkineni Nagarjuna Doing Bangarraju Movie Under Kalyan Krishna Direction. Now This Movie Budget Crossed Over Rs 40 Crore.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X