మొన్న శంకర్, నేడు భారతీ రాజా.. రామ్ #RAPO19కి అంతకంతకూ పెరుగుతున్న క్రేజ్!

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్‌లో ప్రతి రోజు సందడి నెలకొంటుందనే చెప్పాలి. వరుసగా తమిళ్, తెలుగు సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. మొన్నటికీ మొన్ననే స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ RAPO19' సెట్ కి వచ్చి ఆ యూనిట్ అంతటినీ సర్‌ ప్రైజ్‌ చేశారు. కాసేపు రషెస్‌ కూడా చూసి, రామ్‌, దర్శకుడు లింగుస్వామితో ముచ్చటించారు. అలానే ఈరోజు నటుడు, దర్శకుడు భారతీరాజా సెట్‌ లో సందడి చేశారు. 'దర్శకుడు ఇమామ్' గా ప్రసిద్ధి చెందిన దర్శకుడు భారతీరాజా ఈ రోజు తన 78 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

దర్శకుడిగానే కాకుండా కొన్నేళ్లుగా సహాయక పాత్రల్లోనూ నటిస్తున్న భారతీరాజా ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న '#RAPO19' చిత్రంలో నటిస్తున్నారు. ఈ నెల మొదటి వారం నుండి ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే భరత్ రాజా షూటింగ్‌లో ఉన్నందున తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఒక రకంగా రామ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ లైన్లోకి వచ్చాడు..

Bharathiraja birthday celebrations at #RAPO19 set

అయితే ఆ తర్వాత ఆయన చేసిన రెడ్ అనే ప్రయోగాత్మక సినిమా మళ్లీ నిరాశపరిచింది. నేను శైలజ సూపర్ హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమలతో రెడ్ సినిమా చేయగా ఆ సినిమా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే రామ్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. యూటర్న్ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందబోతోంది. ఈ సినిమా కథ పూర్తిగా ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉండబోతుందని అంటున్నారు. రామ్ కి కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ బాగా నచ్చడంతో కథ విన్న వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక దర్శకుడికి తమిళంలో మార్కెట్ ఉండడం, రామ్ కి తెలుగు మార్కెట్ ఉండనే ఉంది. ఈ లెక్కన సినిమా మంచి మార్కెట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X