శూర్పణఖ మళ్లీ పుడితే.. కొత్తగా చెప్పబోతున్న దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత..
తెలుగులో మొట్టమొదటి యానిమేషన్ చిత్రం "కిట్టు " (2006) తో జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత భార్గవ దర్శకత్వంలో "శూర్పణఖ " పేరుతో ఒక చిత్రం రూపొందనుంది . భార్గవ పిక్చర్స్ , కాస్మిక్ రే ప్రొడక్షన్స్ బ్యానర్లపై భార్గవ , D.R రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు . ఈ సందర్భంగా రచయిత , దర్శకుడు భార్గవ మాట్లాడుతూ.. ''మైథలాజికల్ సోషల్ కామెడీ చిత్రం ఇది. రామాయణంలో కీలకమైన మలుపులు శూర్పణఖ వల్లనే సంభవించాయి.
శూర్పణఖ ప్రస్తుత సమకాలీన సమాజంలోకి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అనే కధాంశంతో ఈ చిత్రం రూపొందుతుంది . అసలు శూర్పణఖ ఇప్పుడు ఎలా వచ్చింది? అసలు వచ్చి ఏం చేసింది? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రం శూర్పణఖ దృక్కోణం నుండి రామాయణం చెప్పడమే! శూర్పణఖ ఏ విధంగా అప్పటి లంకను , ఇప్పటి సమాజంతో, అలాగే అప్పటి ప్రజల్ని ఇప్పటి ప్రజలతో ఎలా పోలుస్తుందో ఈ చిత్రంలో కథ గా అల్లడం జరిగింది'' అని తెలిపారు.

చిత్ర నిర్మాతలలో ఒకరైన D.R రెడ్డి మాట్లాడుతూ ''శూర్పణఖ పాత్ర ని ఒక ప్రముఖ నటి చేయబోతుంది . ఆ వివరాలు మరియు మిగిలిన నటీనటులు , సాంకేతిక నిపుణులు తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తాం . ఈ చిత్రం లో vfx కు అధిక ప్రాధాన్యత ఉండడం వలన ప్రీ ప్రొడక్షన్ పకడ్బందీగా చేసుకుంటున్నాం . వచ్చే నెలలో మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది '' అని తెలిపారు .
ఈ చిత్రానికి కథ , మాటలు, కథనం , దర్శకత్వము - భార్గవ .
నిర్మాతలు: భార్గవ, D.R రెడ్డి
బ్యానర్స్: భార్గవ పిక్చర్స్, కాస్మిక్ రే ప్రొడక్షన్స్.


Click it and Unblock the Notifications











