For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bheemla Nayak : అప్పుడే ఒక క్లారిటీకి రావొద్దు.. టైముందిగా.. కవరింగ్ లో పడిన మేకర్స్ !

  |

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి అని చెప్పక తప్పదు.. అయితే ఈ రోజు ప్రకటించిన టైటిల్ మీద ఒక వివాదం చెలరేగింది. అయితే ఆ వివాదాన్ని సినిమా మేకర్స్ సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అందుకు సంబంధించిన వివాదంలో కి వెళ్తే

  సోలో ఫిల్మా?

  సోలో ఫిల్మా?

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ సినిమా నుంచి తాజాగా టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. "భీమ్లా నాయక్" అనే టైటిల్ ను ప్రకటిస్తూ లుంగీలో పవన్ లుక్ రివీల్ అయ్యేలాగా వీడియోను విడుదల చేశారు. ఇక ఎప్పటిలాగానే వీడియోలో పవర్ స్టార్ దుమ్మురేపాడు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది ఒక ట్రీట్.

  అయితే ముందు నుంచీ మల్టీ స్టారర్ అంటూ ఉండడంతో ఇప్పుడు కొత్త అనుమానాలు మొదలయ్యాయి. అదేంటంటే రానా పేరు మాత్రమే సినిమాలో వినిపిస్తోంది. రానాను ఇప్పటిదాకా ఎలాంటి ప్రమోషనల్ కార్యక్రమాల్లో చూపడం లేదు అని రానా ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. ఆ విషయానికొస్తే, అయ్యప్పనుమ్ కోషియుమ్ అనే ఒక మల్టీ స్టారర్ చిత్రం పవర్‌స్టార్ ఇమేజ్ పేరుతో సోలో ఫిల్మ్‌గా మారడం చూసి వారంతా నిరాశ చెందారు.

  మా వాడికి ఏమయింది?

  మా వాడికి ఏమయింది?

  అయ్యప్పనుం కోశియుమ్ అనే మళయాళ టైటిల్ స్క్రీన్ షేర్ చేసుకోవడం మొదలు అన్ని విషయాల్లోనూ రెండు పాత్రల యొక్క సంపూర్ణ సమతుల్యత కనిపించింది. కానీ ఈరోజు టైటిల్ ప్రకటన మొదలు ఫస్ట్ గ్లింప్స్ లో కూడా పవన్ కే ప్రాధాన్యత ఇచ్చారు. రానా కూడా పవన్ అంత కాకపోయినా స్టార్ హీరోనే. అయినప్పటికీ ఇప్పటి వరకు కేవలం ఒక పేరుగా ఆయనని వాడుతున్నారు కానీ అసలు ఒక ఫోటో కానీ లుక్ కానీ లేదు. ఈ క్రమంలోనే అసలు ఇంతకీ ఇది మల్టీస్టారర్ సినిమా ? అనే అనుమానం కూడా వస్తోంది అందరికీ.

  రానా లాంటి మంచి నటుడిని ఉపయోగించుకోలేక పోతున్నారు అంటూ ఆయన ఫాన్స్ బాధ పడుతున్నారు. అంతే కాక ఒరిజినల్ సినిమాలో ఇద్దరు మనుషుల ఇగోను చూపారని, కానీ ఇక్కడ చూస్తుంటే పవన్ ను హీరోను చేసి రానాని విలన్ ను చేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోందని కూడా రానా అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  చేస్తారా చేయరా

  చేస్తారా చేయరా

  తాజాగా ఈ అంశం గురించి ఒక జర్నలిస్ట్ ఈ అర్ధం వచ్చేలగానే స్పందించారు. ఒక మల్టీ స్టారర్ సోలో హీరో సినిమాగా మారిందా?'. అంటూ ప్రశ్నించారు. అయితే వెంటనే ఈ ట్వీట్ కు సినిమా నిర్మాత నాగ వంశీ వివరణ ఇచ్చారు. "దయచేసి వేచి ఉండండి, ఎలాంటి నిర్ధారణలకు రావద్దు, , అన్నీ ఆర్డర్ ప్రకారంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.

  నిజానికి మనం నిజాలు మాట్లాడుకోవాలంటే మొదటి అభిప్రాయం ఎప్పుడూ అత్యుత్తమ అభిప్రాయం(ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్) అని భావిస్తూ ఉంటాం. దీంతో భీమ్లా నాయక్ మేకర్స్ ఈ ముద్ర తొలగించుకోవడానికి చాలా పని చేయాల్సి ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా, టైటిల్ ఎల్లప్పుడూ వారు చేసే పనులపై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. నాగ వంశీ భరోసా నిజమా లేక కేవలం కంటి చూపు తుడుపుగా ఉంటుందేమో చూడాలి.

  మలయాళంలో సూపర్ హిట్

  మలయాళంలో సూపర్ హిట్

  ఈ సినిమాని మలయాళంలో బిజు మీనన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రధారులుగా తెరకెక్కించారు. బిజు మీనన్ ఒక ఏజెన్సీ ప్రాంతంలో పోలీస్ అధికారిగా పని చేస్తూ ఉండగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు.. నో ఆల్కహాల్ జోన్ పరిధిలో ఉన్న ఏజెన్సీ ఏరియాలో కి ఆల్కహాల్ తో ప్రయాణిస్తూ పృథ్వీరాజ్ సుకుమారన్ పట్టుబడతారు.. అయితే మద్యం మత్తులో ఉన్నప్పుడు సుకుమారన్ బిజు మీనన్ మీద చేయి చేసుకునే పరిస్థితి రావడంతో వీరిద్దరి మధ్య ఇగో వార్ మొదలవుతుంది.

  ఇగో వార్ ఎంత దూరం వెళ్ళింది ? ఒకరినొకరు చంపుకునే వరకు ఎందుకు వెళ్ళింది ? అనే దానిని ఆసక్తికరమైన రీతిలో చూపడంతో సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచింది.

   చివరికి ఇలా

  చివరికి ఇలా

  సినిమా కథా కథనాలు రావడంతో అప్పట్లోనే సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ వెంటనే తెలుగు రీమేక్ హక్కులు కొనుగోలు చేసి మరి సినిమా బుక్ చేసేసుకుంది. ఈ సినిమాలో రానా -బాలకృష్ణ, రవితేజ -రానా ఇలా అనేక కాంబినేషన్లు వినిపించినా చివరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మొదలైంది.

  అయితే ఒక పెద్ద దర్శకుడి చేతిలో సినిమా పెడతారు అనుకుంటే సాగర్ కే చంద్ర అనే ఒక సినిమా తీసిన దర్శకుడి చేతిలో పెట్టారు. అయితే సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ కథనం మాటలు అందిస్తూ ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా రానా సరసన ఎవరు నటిస్తున్నారు అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.. రఘుబాబు, బ్రహ్మాజీ లాంటివాళ్ళు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

  English summary
  Responding to a netizen tweet, "Bhimla Nayak" producer Naga Vamsi said that they have not come to a conclusion yet and everything is going according to order.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X