Bheemla Nayak Pre Release Event Live Updates: దిక్కులు పిక్కటిల్లేలా పవన్ ఫ్యాన్స్ హంగామా.. పార్కింగ్ ఎక్కడంటే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అత్యంత ఉత్సాహంతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హైదరాబాద్‌ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మధ్యాహ్నం నుంచే పవన్ కల్యాణ్ అభిమానులు స్టేడియానికి పోటేత్తారు. అత్యంత భారీగా నిర్వహిస్తున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కు సంబంధించిన లైవ్ అప్ డేట్స్ 6.30 గంటల నుంచి మీ కోసం..

తమన్, శివమణి వీడియో


భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సంగీత దర్శకుడు ఎస్ తమన్, అంతర్జాతీయ డ్రమ్మర్ శివమణి తమ ఏర్పాట్లలో మునిగిపోయారు. అర్ధరాత్రి తమ పనులను ముగించుకొని వెళ్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గలగలగలగల భీమ్లా అంటూ సందడి చేశారు. ఈ వీడియోను మీరే చూడండి..

డ్యాన్సర్ల రిహార్సల్స్


ఇక భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను భారీగా నిర్మించారు. ఈవెంట్‌కు ముందే అక్కడ కొందరు డ్యాన్సర్లు ముందు వేడుకపై డ్యాన్స్‌లను రిహార్సల్ చేశారు. ఈ రిహార్సల్ వేడుక ఆద్యంత పవన్ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచింది. దాంతో ఈ ఈవెంట్‌పై అందరి దృష్టిపడింది.

ట్రాఫిక్ నిబంధనల, ఆంక్షలు


భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ అభిమానులు భారీగా పోటెత్తడంతో హైదరాబాద్‌లోని యూసఫ్ గూడలో ట్రాఫిక్ నిబంధనలు, ఆంక్షలను విధించారు. ఆ ప్రాంతంలోకి వెళ్లే వాహనదారులను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో పార్కింగ్‌కు వసతులు కల్పించారు.

పార్కింగ్ చేయాల్సిన ప్లేసులు ఇవే


భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చే అభిమానులు, ప్రముఖుల కోసం పలు చోట్ల పార్కింగ్ ప్లేసులను కేటాయించారు. స్టేడియానికి దగ్గర్లోని సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడ మెట్రో స్టేషన్, సవేరా ఫంక్షన్ హాల్‌కు ఎదురుగా ఉన్న ఓపెన్ గ్రౌండ్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, యూసఫ్ గూడ ప్రభుత్వ పాఠశాలలో పార్కింగ్ స్లాట్స్‌ను ఏర్పాటు చేశారు.

Recommended Video

Bheemla Nayak Trailer Records భీమ్లా నాయక్ రికార్డుల బీభత్సం Pre Booking Status | Filmibeat Telugu

మధ్యాహ్నం వరకే కిక్కిరిసిన స్టేడియం


భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సాయంత్రం ఆరంభం కావాల్సి ఉండగా, మధ్యాహ్నం నుంచే వేదిక వద్దకు పవన్ కల్యాణ్ అభిమానులు చేరుకొన్నారు. సాయంత్రం ఐదు గంటల వరకే ఫ్యాన్స్‌తో ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X