Don't Miss!
- News
కేసీఆర్ లక్ష్యంగా.. సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్ట్, మేఘా కంపెనీపై కాంగ్రెస్ ఫిర్యాదు; సీబీఐ స్పందిస్తుందా?
- Lifestyle
మన జాతీయ జెండా ఏర్పడటం వెనుక ఉన్న చారిత్రక కథ మీకు తెలుసా?
- Finance
పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లు చెక్ చేశారా..?
- Automobiles
హోండా ఎంతో సస్పెన్స్ క్రియేట్ చేసి లాంచ్ చేసిన మోటార్‌సైకిల్ ఇదే.. సిబి300ఎఫ్ Honda CB300F
- Sports
Chess Olympiad 2022 ముగింపు వేడుకలకు ధోనీ.. టాప్‌లో హంపీ టీమ్
- Technology
Realme Watch 3 Pro ఇండియా లాంచ్ వివరాలు వచ్చేసాయి. స్పెసిఫికేషన్లు చూడండి.
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
ఇంకా తగ్గని భీమ్లా మేనియా.. హైదరాబాద్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా పవర్ స్టార్ కటౌట్స్.. ఇండస్ట్రీలోనే తొలిసారిగా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే 'భీమ్లా నాయక్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మల్టీస్టారర్‌గా వచ్చిన ఈ సినిమాలో దగ్గుబాటి రానా కూడా నటించాడు. ఇది కూడా భారీ అంచనాలతోనే విడుదలైంది. అయితే, కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా కలెక్షన్లు ఆశించినంత అయితే రాలేదు. ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' మూవీ ఇప్పుడు ఓటీటీలో కూడా మన ముందుకు వచ్చేసింది. ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన స్టెప్ తీసుకుంది ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ + హాట్ స్టార్. ఆ వివరాల్లోకి వెళితే...

ఓటీటీ
సుదీర్ఘమైన విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. అలా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా ముఖ్య పాత్రల్లో నటించిన భీమ్లా నాయక్ ఇటీవలనే విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కరోనా కాలం తరువాత అశేష ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువచ్చిన భీమ్లా నాయక్ ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్ యాప్ ద్వారా ఇంటిల్లిపాదినీ అలరిస్తున్నారు.

డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి
ఇక
ఓటీటీ
ప్లాట్‌ఫామ్
డిస్నీ+హాట్‌స్టార్‌లో
మార్చి
24
నుంచి
స్ట్రీమింగ్
మొదలైన
భీమ్లానాయక్
ఇప్పటికే
రికార్డులు
బద్దలుకొడుతుంది.
అయితే
ఈ
సినిమాను
మరింత
మందికి
చేరువయ్యేలా
చేయడానికి
డిస్నీ+హాట్‌స్టార్‌తో
కలిసి
పవర్‌స్టార్
అభిమానులు
ఓ
వినూత్నమైన
ఎలివేషన్
కార్యక్రమాన్ని
హైదరాబాద్‌లోని
నెక్లెస్‌రోడ్‌లో
ఏర్పాటు
చేసింది.

భారీ స్ధాయిలో ఎలివేషన్
మార్చి
25
సాయంత్రం
జరిగిన
ఈ
కార్యక్రమంలో
300
మందికి
పైగా
పవర్‌స్టార్
పవన్‌కళ్యాణ్
అభిమానులు
పాల్గొన్నారు.
'కంటెంట్
ఉన్నోడికి
కటౌట్
చాలు'
అని
'గబ్బర్
సింగ్'లో
ఒక
డైలాగ్
ఉంటుంది.
దానికి
తగ్గట్టే'భీమ్లానాయక్'
సినిమాలో
ఏ
విధంగా
అయితే
పవన్
కళ్యాణ్
జీపుపై
కూర్చుంటాడో
అదే
తరహాలో
జీపుపై
పవన్
కటౌట్‌ను
ఆవిష్కరించారు.
ఓ
సినిమా
ప్రమోషన్
కోసం
భారీ
స్ధాయిలో
ఎలివేషన్
చేయడం
ఇదే
తొలిసారి
అని
అంటున్నారు.

నెక్లెస్ రోడ్‌లో సందడి
ఇక
పవన్
కళ్యాణ్
మాస్కులు
ధరించి
సందడి
చేసిన
అభిమానులు
నెక్లెస్
రోడ్‌లో
సందడి
చేయడమే
కాదు,
ఈ
ఎలివేషన్‌ను
ఆవిష్కరించారు.
ఓ
క్రేన్
కు
వేలాడదీసిన
ఈ
జీపు
నెక్లెస్
రోడ్‌లో
అన్ని
వైపులా
కనిపించేలా
చేయడంతో
పాటుగా
పవన్
కళ్యాణ్
సినిమాల్లోని
పాటలతో
వీక్షకులలో
ఆసక్తిని
రేకిత్తించారు.
ఇక
ఈ
భీమ్లా
నాయక్
ప్రస్తుతం
డిస్నీ+హాట్‌స్టార్‌లో
స్ట్రీమింగ్
అవుతుంది.

ఫైనల్ రన్
ఇక ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఆంధ్ర, తెలంగాణలో రూ. 76.84 కోట్లు వసూలు చేసిన 'భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లో నిరాశనే ఎదుర్కొంది. ఫలితంగా కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 8.24 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.55 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ముగింపు సమయానికి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.63 కోట్లు షేర్‌తో పాటు రూ. 159.10 కోట్ల గ్రాస్ వచ్చింది. 'భీమ్లా నాయక్' బిజినెస్ మేరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఈ లెక్కన 10.37 కోట్ల లాస్ లో సినిమా ఫైనల్ రన్ ముగించింది.