పబ్లిక్‌గా హీరోయిన్‌తో స్టార్ హీరో సరసాలు.. ఆమె వద్దంటున్నా స్టేజ్‌పైనే

భారతదేశంలో సినిమా ఒక మతమైతే .. నటీనటులు తెరవేల్పులు. సినీతారలను దైవంలా పూజిస్తారు అభిమానులు. అలాంటప్పుడు వారి మాటలు, చేతలు స్పూర్తివంతంగా ఉండాలి. ఎందుకంటే తమ అభిమాన నటుల్ని చూసి అనుకరించేవారు మనదేశంలో కోట్లలో ఉన్నారు. అందుకే సెలబ్రెటీలు అన్ని వేళల్లో బాధ్యతగా వ్యవహరించాలని నిపుణులు చెబుతుంటారు. అయితే కొందరు బాధ్యతను మరిచిపోయి ప్రవర్తిస్తూ వివాదాల్లో చిక్కుకుంటారు. తాజాగా ఓ సూపర్‌స్టార్ పబ్లిక్‌గా హీరోయిన్‌తో సరసాలు ఆడుతూ దొరికిపోయాడు. ఈ వివరాల్లోకి వెళితే..

సింగర్‌ టూ యాక్టర్
భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా, పవర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ సింగ్. తొలుత సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. సినిమాలలో చిన్నాచితకా పాత్రలు పోషిస్తూ వచ్చారు. ఆ తర్వాత ప్రతిగ్యా, సత్య, క్రాక్ ఫైటర్, రాజా, షేర్ సింగ్, మేరా భారత్ మహాన్, హర్ హర్ గంగే వంటి సినిమాలతో అభిమానుల్లో క్రేజ్ దక్కించుకున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ స్త్రీ 2లో ఆయే నై అనే సాంగ్‌తో పవన్ సింగ్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు.

Bhojpuri Superstar Pawan Singh misbehave with Atress Anjali Raghav

ఎన్నికల్లో ఓటమి
2024 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయాలని భావించింది. అయితే తనకు అక్కడి నుంచి పోటీ చేయడం లేదని పవన్ సింగ్ ఈ ఆఫర్‌ను తిరస్కరించారు. అయితే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కరాకత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేశారు పవన్ సింగ్. ఆయన కోసం భోజ్‌పురి ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చి ప్రచారం చేసినా పవన్ సింగ్‌కు ఓటమి తప్పలేదు. పవన్‌పై రాజా రామ్ సింగ్ కుశ్వాహ విజయం సాధించారు.

రిసార్ట్‌లో హీరోయిన్‌పై దాడి
అయితే పవన్ సింగ్ తీరు తొలి నుంచి వివాదాస్పదమే. ఏడేళ్ల క్రితం పీకలదాకా తాగిన ఆయన తనతో పాటు నటిస్తోన్న ఓ హీరోయిన్‌ని రిసార్ట్‌కి వెళ్లి మరి కొట్టాడు. ఆమె తలని గోడకేసి బాదడంతో హీరోయిన్ అరుపులు, కేకలు పెట్టింది. దీనిపై రిసార్ట్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సదరు హీరోయిన్‌తో పవన్ సింగ్ గతంలో ఎఫైర్ నడిపినట్లుగా కూడా భోజ్‌పురి ఇండస్ట్రీలో టాక్. తొలుత పవన్ సింగ్‌కు నీలం సింగ్ అనే యువతితో పెళ్లయ్యింది. ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించగా, ఆ తర్వాత జ్యోతి సింగ్ అనే మహిళను పెళ్లాడారు పవన్ సింగ్.

స్టేజ్‌పై హీరోయిన్ నడుము గిల్లుతూ
తాజాగా పవన్ సింగ్ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. తన కొత్త పాట సయ్యా సేవాకరే హిట్ కావడంతో ఆయన మంచి జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన కార్యక్రమంలో స్టేజ్ పై నటి, సింగర్ అంజలి రాఘవ్ మాట్లాడుతుండగా పవన్ సింగ్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె నడుమును గిల్లుతూ ఇబ్బంది పెట్టాడు. అంజలి ఇబ్బందిగా ఫీల్ అవుతూ పక్కకి జరుగుతున్నా వదిలి పెట్టకుండా నడుమును గిల్లుతూనే ఉన్నాడు. నడుము మీద ఏదో శుభ్రం చేస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తూ కనిపించాడు. ఈ పరిణామంతో అంజలికి ఏం చేయాలో తెలియక బలవంతంగా నవ్వుతూ కవర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పవన్ సింగ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. మరి దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

More from Filmibeat

Read more about: Pawan Singh Anjali Raghav
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X