యువ హీరో వరకట్న వేధింపుల కేసు.. భార్య కుట్ర వేరే, లీక్ చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ యువ హీరో ధర్మ మహేశ్‌పై అతని భార్య వరకట్న వేధింపుల ఆరోపణలు చేయడం కలకలం రేపింది. అతనికి వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, తనను టార్చర్ చేస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే పలు ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో పోలీసులు ధర్మ మహేశ్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదవ్వగా.. మహేశ్ పలుమార్లు కౌన్సెలింగ్‌కి కూడా వెళ్లొచ్చాడు. తాజాగా ఈ కేసుపై బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాషా సంచలన వ్యాఖ్యలు చేశారు.
యువతలో ధర్మ మహేశ్‌కు క్రేజ్
కాగా.. తెలుగులో సింధూరం, డ్రింకర్ సాయి వంటి పలు చిత్రాలతో యువతలో క్రేజ్ సంపాదిస్తోన్నాడు ధర్మ మహేశ్. సినిమాల్లో నటిస్తూనే పలు వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్. అయితే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గౌతమి చౌదరితో అతనికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. దీంతో ఆమెను 2019లో మహేశ్ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఓ కుమారుడు సంతానం. వివాహం తర్వాత గౌతమి, మహేశ్ కలిసి ఓ రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

ధర్మ మహేశ్‌పై వేధింపుల కేసు
గత కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నట్లుగా ఊహాగానాలు వినిపించాయి. ఈ దశలో మహేశ్‌పై గౌతమి వరకట్న వేధింపుపల ఆరోపణలు చేయడం కలకలం రేపింది. అతను సినిమాల్లో మాత్రమే హీరో అని, పెళ్లి తర్వాత మహేశ్ నిజస్వరూపం తెలిసిందని ఆరోపించింది గౌతమి చౌదరి. అర్ధరాత్రి వరకు అమ్మాయిలతో జల్సాలు చేసి ఇంటికి వచ్చేవాడని, అతనికి నా డబ్బు, నా హోటల్స్ మీద వచ్చే లాభాలు కావాలని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భర్త కుటుంబానికి డబ్బు పిచ్చని.. వందల కోట్ల వరకట్నం కావాలని డిమాండ్ చేస్తున్నారని, ఇప్పటి వరకు వారి వేధింపులు మౌనంగా భరించానని కానీ ఇక తన కొడుకు కోసం పోరాడుతానని గౌతమి తేల్చిచెప్పింది.
పెళ్లి కోసం సూసైడ్ వరకు
ఇదిలాఉండగా.. గౌతమి చౌదరి - మహేశ్ కేసు వ్యవహారంపై బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గౌతమి కంటే ధర్మ చాలా చిన్నవాడని, ఇతని కుటుంబం తొలి నుంచి తెలుగుదేశం పార్టీ మద్ధతుదారులు. గౌతమి చౌదరి కుటుంబం ఫస్ట్ నుంచి వైసీపీయేనని, దాంతో ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ధర్మ మహేశ్ ఆత్మహత్య వరకు వెళ్లడంతో పెళ్లి చేశారు. పెళ్లికి ముందే గిస్మత్ బ్రాండ్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో హోటల్స్ స్టార్ట్ చేశాడని శేఖర్ భాషా చెప్పాడు.
గిస్మత్ బ్రాండ్ చుట్టూ వివాదం
ధర్మ మహేశ్‌పై నమోదు చేసిన కేసుకు సంబంధించి గౌతమి చౌదరి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు చూపించలేదు. ఆవిడ ఎల్ఎల్‌బీ గ్రాడ్యుయేట్ కాబట్టి వ్యవస్థ ఎలా పనిచేస్తుందో బాగా తెలుసు.. పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిన తర్వాత మీడియాకు పదే పదే ఇంటర్వ్యూలు ఇచ్చి కేసును ముందుకు నడిపాలన్న ఉద్దేశంతోనే. మీడియా ఎంత ప్రెజర్ చేసినా సాక్ష్యాధారాలు లేకపోతే పోలీసులు కూడా ఏం చేయలేరు.. కేసు పెడతారు, కౌన్సెలింగ్ ఇప్పిస్తారని శేఖర్ భాషా అన్నారు. గిస్మత్ బ్రాండ్ నాది, నా సొంతమని ఆమె చెబుతోంది.. కానీ అది నిజం కాదు. పెళ్లికి ముందే ధర్మ మహేశ్ ఆ బ్రాండ్ స్టార్ట్ చేశాడు, ఇది అతని పేరు మీదే ఉంది. పెళ్లయిన తర్వాత గౌతమి కూడా సహకారం అందించింది.
బాండ్ చెల్లదన్న ధర్మ మహేశ్
ధర్మ నటిస్తోన్న సినిమా సెట్‌కి వచ్చి హీరోయిన్లతో ఉండే కెమెస్ట్రీని ఆమె తప్పుగా భావించవచ్చు. ఒకవేళ అమ్మాయితో ధర్మ మహేశ్‌ని గౌతమి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దానికి ఎలాంటి శిక్షలు లేవు. కాకపోతే దీనిని బేస్ చేసుకుని భర్త నుంచి విడాకులు కోరవచ్చు. అయితే గిస్మత్ బ్రాండ్‌ని గౌతమి తన పేరు మీద రాయించుకుందని, ఆ తర్వాతి నుంచి మహేశ్‌ను ఆమె చులకనగా చూస్తోందని శేఖర్ భాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తాను రాసిచ్చిన బాండ్ చెల్లదని మహేశ్ అబ్జెక్షన్ పెట్టగా.. అప్పటి నుంచి వారిద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయని శేఖర్ భాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతమి తండ్రి మీద సీఎం చంద్రబాబు నాయుడుపై రాళ్ల దాడి చేసిన కేసు ఉందని, దాని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని సంచలన విషయం బయటపెట్టారు. మరి దీనిపై గౌతమి చౌదరి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











