‘నాగార్జునను చూస్తే ఆపుకోలేను.. స్టేజ్ మీదే కింగ్‌తో అలా’

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి... టాలీవుడ్‌ అగ్రనటుల్లో ఒకరిగా, ప్రయోగాలకు మారు పేరుగా, ప్రతిభను ప్రోత్సహించే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినీనటులు కూడా వ్యాపారాల్లో రాణించగలరని నిరూపించిన అతికొద్ది మంది స్టార్స్‌లో నాగ్ కూడా ఒకరు. భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్స్ కమ్ యాక్టర్స్ లిస్ట్‌లో నాగార్జున పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆయనను చూసి ఎంతోమంది నటులు వ్యాపారాల్లో దిగారు. నాగార్జన అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన గ్లామర్, ఫిజిక్. అమ్మాయిల కలల రాకుమారుడిగా, మన్మథుడిగా నిలిచిపోయిన నాగార్జున.. 70కి చేరువ అవుతున్నప్పటికీ చెక్కుచెదరని గ్లామర్‌తో మెరిసిపోతున్నారు. స్వయంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సైతం నాగార్జున వయసు రోజురోజుకు తగ్గిపోతోందని ప్రశంసించారు.

కూలీలో స్టైలీష్ విలన్‌గా
నటుడిగా, స్టూడియో అధినేతగా, వ్యాపారవేత్తగానే కాకుండా హోస్ట్‌గానూ నాగార్జున సక్సెస్ అయ్యారు. బిగ్‌బాస్ తెలుగును దాదాపు 8 ఏళ్లుగా హోస్ట్ చేస్తూ... తెలుగు నాట బిగ్‌బాస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. ఇటీవలే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీలో సైమన్‌గా విలన్ పాత్ర పోషించారు. ప్రస్తుతం తన 100వ సినిమా ప్లానింగ్‌లో ఉన్నారు నాగ్. కఠిన వ్యాయామాలు, డైట్, ప్రశాంతంగా ఉండటంతో తాను ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నానని నాగ్ పలుమార్లు చెప్పారు. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా నాగార్జున అభిమానులే. వీరిలో లేడీ ఫాలోయింగ్ ఆయనకు మరింత ఎక్కువ. తాజాగా లేడీ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న గీతా సింగ్ ఓ ఇంటర్వ్యూలో నాగార్జునపై అభిమానాన్ని చాటుకున్నారు.

Bigg Boss Telugu 9 Actress Geetha Singh wants to kiss Akkineni Nagarjuna

కితకితలతో ఫేం
ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన కితకితలు సినిమాలో హీరోయిన్‌గా నటించారు గీతా సింగ్. ఈ సినిమా కంటే ముందే జై చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు గీతా సింగ్. ఆ తర్వాత ఎవడిగోల వాడిది, అల్లరి పిడుగు, ప్రేమాభిషేకం, దొంగల బండి, శశిరేఖ పరిణయం, మళ్లీ మళ్లీ, సీమటపాకాయ్, ధూల్, సరైనోడు ఇలా హిట్ చిత్రాలలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. 20 ఏళ్ల కెరీర్‌లో 70కి పైగా సినిమాలలో నటించారు. అయితే గత కొన్నేళ్లుగా గీతా సింగ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న గీతా సింగ్‌ ఓ ఛానెల్‌లో మాట్లాడుతూ తనకు బిగ్‌బాస్‌కు వెళ్లాలని ఉందని కుండబద్ధలు కొట్టింది.

కనిపిస్తే ముద్దు పెట్టేస్తా
బిగ్‌బాస్‌లో ఊరుపేరు లేని ఆర్టిస్టులను తీసుకొస్తున్నారని.. అదే పాత ఆర్టిస్ట్‌లను తీసుకొస్తే షో వేరే రేంజ్‌లో ఉంటుందని తెలిపారు. ఇక నాగార్జున గారు హోస్టింగ్ అదరగొట్టేస్తున్నారని గీతా సింగ్ చెప్పింది. నాగార్జునను చూడగానే ఫస్ట్ బుగ్గపై ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది. నాగార్జున గారంటే నాకు చాలా ఇష్టమన్నమాట. ఆయనను చాలా సార్లు చూసినా దగ్గరికి వెళ్లి ఎప్పుడూ మాట్లాడలేదు. బిగ్‌బాస్‌లో అవకాశం వస్తే కంపల్సరీగా ఏం మాట్లాడకుండా వెళ్లి ఫస్ట్ ముద్దు పెట్టేసి తర్వాత మాట్లాడతాను. అప్పుడింక మాటల్లేవని గీతా సింగ్ అన్నారు.

గ్రామాల్లోకి బిగ్‌బాస్
బిగ్‌బాస్ అంటే ఎందుకంత ఇంట్రెస్ట్ అని గీతా సింగ్‌ను యాంకర్ ప్రశ్నించగా... చాలా మంది బిగ్‌బాస్‌ను చూస్తున్నారు. పల్లెటూళ్లలో కూడా బిగ్‌బాస్ చూస్తున్నారు. షో స్టార్ట్ అయ్యిందంటే అందరూ టీవీ దగ్గరే ఉంటున్నారు. ఈవెంట్స్‌కి వెళ్లినప్పుడు కూడా ఏంటీ? ఇంకా ఎవ్వరూ రాలేదేంటీ? అని అడిగితే బిగ్‌బాస్ చూస్తున్నారని అక్కడి వాళ్లు చెప్పడంతో షాకయ్యా. మనం వాళ్ల కోసం అంత దూరం నుంచి వస్తే.. వీళ్లేమో బిగ్‌బాస్ చూసుకుంటున్నారని అనిపించింది. ప్రజల్లోకి బిగ్‌బాస్ బాగా రీచ్ అయిపోయిందని, ఈ షోతో మనం ఇంకా రీచ్ అవుతాం కదా? పెద్ద స్క్రీనే కాదు, చిన్న స్క్రీన్ కూడా మనకి బాగుంటుంది కదా అని గీతా సింగ్ చెప్పారు.

నా జోలికి వస్తే కుమ్మేస్తా
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత ఎవరో ఒకరు వండుతారు కదా తినేస్తా. మనం డైట్‌లో ఉన్నాం కాబట్టి.. నాగార్జున గారు జ్యూస్‌లు పెడతారు, పనిలో పనిగా లాగించేస్తాం. ఎవరైనా గొడవపడితే కుమ్మేస్తా.. నేనే ఉంటా ఫైనల్ దాకా, ఇంకెవరూ ఉండరు. నాతో పెట్టుకోవడం ఎందుకులే అని నువ్వే ఉండమని వాళ్లే అంటారు... మ్యాగీలు ఉంటాయి కాబట్టి వేడి నీళ్లు పోసుకుని చేసుకుని తినేస్తా, జ్యూస్‌లు తాగేస్తా. ప్రస్తుతం గీతా సింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X