Don't Miss!
- News
తెలంగాణను మర్చిపోయారు: కేంద్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎంపీలు
- Sports
WPL 2023: బీసీసీఐకి సమస్యగా మారిన పెళ్లిళ్ల సీజన్!
- Lifestyle
యాపిల్ సైడర్ వెనిగర్ వంధ్యత్వాన్ని దూరం చేస్తుంది..పిల్లలు పుట్టడానికి సహాయపడుతుంది
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Finance
Mukesh Ambani: అదానీని వెనక్కి నెట్టిన అంబానీ.. ఓడలు బండ్లవ్వటమంటే ఇదే..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Ram Gopal Varmaపై కేసు నమోదు! రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ట్విట్టర్‌లో ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ముపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సీనియర్ మహిళ నాయకురాలి ప్రతిష్టను కించపరిచే విధంగా వర్మ చేసిన వ్యాఖ్యలపై కాషాయ దళాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆర్జీవిపై కేసు నమోదు కానున్నది. ఈ వివరాల్లోకి వెళితే..
|
ద్రౌపది రాష్ట్రపతి అయితే..
రాష్ట్రపతి పదవికి జరిగే పోటీ కోసం బీజేపీ బలపరిచిన ఎన్టీఏ కూటమి ద్రౌపది ముర్ము గురించి ట్వీట్ చేస్తూ.. ఒకవేళ ద్రౌపది రాష్ట్రపతి అయితే.. మరి పాండవులు ఎవరు? ముఖ్యంగా కౌరవులు ఎవరై ఉంటారు అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేస్తూ సందేహం వ్యక్తం చేశారు.
|
మనోభావాలు దెబ్బ తీయడం..
ఆ తర్వాత తాను చేసిన వివాదాస్పద ట్వీట్‌పై రాంగోపాల్ వర్మ స్పందించారు. నా వ్యాఖ్యలు ఎవరిని నొప్పించేందుకు కాదు. మహాభారతంలో ద్రౌపది నా ఫేవరేట్ క్యారెక్టర్. కానీ.. ఆ పాత్ర చుట్టూ ఉండే క్యారెక్టర్లు నా మదిలో అలా ఉండిపోయాయి. ఆ ఉద్దేశంతోనే నేను నా భావాన్ని ట్వీట్ చేశాను. ఎవరి మనోభావాలను దెబ్బ తీయడం నా అభిమతం కాదు అని వర్మ తన ట్వీట్ గురించి క్లారిటీ ఇచ్చారు.

భగ్గుమన్న బీజేపీ నేతలు
వర్మ ట్వీట్ చేసిన వెంటనే భారతీయ జనతా పార్టీ వర్గాలు ధాటిగా వాగ్బాణాలు, సోషల్ మీడియాలో కామెంట్లతో దాడి చేశారు. తెలంగాణ ప్రాంతంలోని బీజేపీ నాయకుడు జీ నారాయణ రెడ్డి అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వర్మపైౌ క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. పలువురు బీజేపీ నేతలు భగ్గుమన్నారు.

అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
రాంగోపాల్ వర్మపై కేసు నమోదు అవ్వడం నిజమే అని హైదరాబాద్ పోలీసులు ధృవీకరించారు. జీ నారాయణ రెడ్డి కేసు నమోదు చేశారు. ఆయన ఫిర్యాదును లీగల్ ఒపీనియన్ కోసం పంపాం. లీగల్ ఒపీనియన్ రాగానే.. నిపుణుల సలహా తీసుకొని అవసరమైతే వర్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తాం అని జాతీయ మీడియాకు అబిడ్స్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ బీ ప్రసాద రావు తెలిపారు.

ఆర్జీవిని కఠినంగా శిక్షించాలి అంటూ
వర్మ చేసిన ట్వీట్.. దానికి వివరణ ఇచ్చిన ట్వీట్‌పై బీజేపీ జాతీయ నాయకుడు పీ మురళీధర్ రావు ఘాటుగా స్పందించాడు. దుష్ణబుద్దికి సంబంధించిన వ్యక్తిత్వం ప్రదర్శించాడు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి గురించి గౌరవప్రదంగా, ఉన్నతంగా స్పందిచాల్సిన అవసరం ఉంటుంది. మహిళల విషయంలో ఇంకా ఆచీతూచి వ్యవహరించాలి. దారుణంగా కామెంట్లు చేసి... జారుకోవాలని ప్రయత్నించే ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అని ఆయన డిమాండ్ చేశారు.