Don't Miss!
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- News
సీజేఐ డీవై చంద్రచూడ్ కొత్త టీమ్..!!
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
హరిహర వీరమల్లులో మరో స్టార్: పవర్‌ఫుల్ గెటప్‌తో ఎంట్రీ ఇచ్చిన హీరో
గతంలో కంటే ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాలు మీద సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇలా ఇప్పటికే 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన అతడు.. ఇప్పటికే మరిన్ని ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. అలా పవర్ స్టార్ ఇప్పుడు చేస్తోన్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో ఈ చిత్రం వస్తోంది. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
హాట్ డ్రెస్‌లో రెచ్చిపోయిన లైగర్ పాప: ఆమెను ఇలా చూస్తే అస్సలు ఆగలేరు!
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా ఆటంకాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలోనే దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించి.. టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ చేసుకుంటోంది. అందుకు అనుగుణంగానే అన్ని పనులపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే ఇందులో నటించే నటీనటులను కూడా కొత్త షెడ్యూల్‌లో భాగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీలో మరో స్టార్ భాగం అయినట్లు అధికారికంగా ప్రకటించారు.
రాజుల కాలం నాటి కథతో రాబోతున్న 'హరిహర వీరమల్లు' మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ బాలీవుడ్ నుంచి పలువురు స్టార్లను కూడా ఈ సినిమా కోసం ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సీనియర్ హీరోను తీసుకుంది. అది ఎవరో కాదు.. బాలీవుడ్‌కు చెందిన బాబీ డియోల్. తాజాగా ఈ మూవీలో ఆయన భాగం అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఇందులో ఆయన ఎంతో స్టైలిష్ గెటప్‌తో సెట్స్‌లోకి అడుగు పెట్టినట్లు చూపించారు. ఇక, ఈ మూవీలో బాబీ డియోల్ ఓ రాజు పాత్రను చేస్తున్నట్లు తెలిసింది.
కొత్త లవర్‌తో హీరోయిన్ అరాచకం: ప్యాంట్ తీసేసి మరీ.. మరీ ఇంత దారుణమా!

పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. దీన్ని వచ్చే సమ్మర్‌లో విడుదల చేయబోతున్నారు.