For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Waltair Veerayya మూవీలో సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌ను థ్రిల్ చేసేలా స్పెషల్ కార్డు

  |

  ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీని ఇస్తూ.. వరుస చిత్రాలతో సందడి చేస్తూ దూసుకుపోతోన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఏజ్‌తో సంబంధం లేకుండా రెట్టించిన ఉత్సాహంతో కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్న ఆయన.. ప్రస్తుతం 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాను చేస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర రూపొందిస్తోన్న ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రను చేస్తోన్నాడు. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్‌తో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని రెడీ చేశారు.

  బిడ్డకు పాలిచ్చే వీడియో వదిలిన సీరియల్ హీరోయిన్: ఆమె ఎందుకిలా చేసిందో తెలిస్తే!

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తైపోయింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసేసి ప్రేక్షకులకు సినిమాను చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే మరో రెండు రోజుల్లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా ఎంతో గ్రాండ్‌గా నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి మెగా అభిమానులను సంబరపరిచే ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

  Bobby Designs Vintage Megastar Card for Waltair Veerayya

  మాస్ మసాలా స్టోరీతో రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మూవీని దర్శకుడు బాబీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైనల్ కాపీని కూడా రెడీ చేసేశాడు. ఒక అభిమాన హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో దీనితో నిరూపించబోతున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో అంశాలపై ఫోకస్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో 'మెగాస్టార్ చిరంజీవి' అని వచ్చే టైటిల్ కార్డుపై పాత రోజులను గుర్తు చేసేలా చిరంజీవి వింటేజ్ లుక్‌ను డిజైన్ చేసి పెట్టాడట. ఈ అంశం మాత్రం అభిమానులు థ్రిల్ చేసేలా ఉంటుందని సమాచారం.

  Bobby Designs Vintage Megastar Card for Waltair Veerayya

  నిధి అగర్వాల్ హాట్ వీడియో వైరల్: ప్రైవేట్ ప్లేస్‌లో టాటూ.. అలా చూపిస్తూ!

  మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో బాబీ రూపొందిస్తోన్న 'వాల్తేరు వీరయ్య' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

  English summary
  Chiranjeevi Did Waltair Veerayya Movie Under K. S. Ravindra Direction. Now Bobby Designs Vintage Megastar Card for This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X