తెర మీద శృంగారానికి షకీలా సిద్ధం.. క్రేజీ పాత్రలో మీర్జాపూర్ విలన్.. ఫస్ట్ లుక్ వైరల్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో శృంగార పాత్రలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన షకీలా జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో షకీలా అనే పేరుతో మూవీ తెరకెక్కుతున్నది. గత కొద్దికాలంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రేక్షకులను ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తున్నది. ఈ క్రమంలో లాక్ డౌన్ తర్వాత షకీలా సినిమా రిలీజ్‌కు మోక్షం లభించింది. ఈ నేపథ్యంలో మిర్జాపూర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులకు చేరువైన పంకజ్ త్రిపాఠి షకిలాలో కీలక పాత్రను పోషిస్తున్నాడు.
షకీలా చిత్రంలో తన పాత్రకు సంబంధించిన లుక్‌ను షేర్ చేయగా ట్విట్టర్‌లో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నది. సకీలా చిత్రంలో పంకజ్ త్రిపాఠి సూపర్ స్టార్ పాత్రలో నటిస్తున్నారు. షకీలా సినిమా గురించి వెల్లడిస్తూ.. క్రిస్మస్ పండుగ కానుకగా షకీలా మీ ముందుకు వస్తున్నదనే విషయాన్ని తెలియచేయడానికి థ్రిల్ అవుతున్నాను.

ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ రిచా చద్దాతో కలిసి నటించాను. ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించాను. సినిమా జీవితంలో నిజమైన పాత్రలో కనిపిస్తాను. రిల్ లైఫ్‌లో రియల్ పాత్రను పోషించాను. చాలా కలర్ ఫుల్ క్యారెక్టర్ అంటూ పంకజ్ త్రిపాఠి చెప్పారు.
పంకజ్ త్రిపాఠి కెరీర్ విషయానికి వస్తే.. 2003లో చిగురిదా కనసు అనే కన్నడ చిత్రంతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత రావణ్, ఆక్రోష్, అగ్నిపథ్ లాంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. 2013లో తెలుగులో దూసుకెళ్తా అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. పలు బాలీవుడ్ చిత్రాల్లో తనదైన పాత్రలతో మెప్పించారు. సెక్రెడ్ గేమ్స్, మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్ లాంటి వెబ్ సిరీస్‌తో అత్యంత పాపులారిటీని సాధించాడు.


Click it and Unblock the Notifications











